వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న థెరిస్సా, కర్దాషియన్: ట్రంప్ తీరుపై మౌనం వీడిన ఒబామా

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధానాల పైన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధానాల పైన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా స్పందించారు. వలసలు, శరణార్థుల విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఒబామా మౌనం వీడారు. హాలిడే ట్రిప్‌లో ఉన్న ఒబామా తన అధికార ప్రతినిధి ద్వారా ప్రకటన చేశారు.

ఆయన ట్రంప్‌ విధానాలను విమర్శించారు. మతం, విశ్వాసాల ఆధారంగా వ్యక్తులను వివక్షకు గురి చేయడంపై తాను ఏకీభవించనని చెప్పారు. తన విదేశాంగ విధానాలు కూడా అదే విషయాన్ని చాటాయన్నారు.

<strong>హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం</strong>హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం

కాగా, ట్రంప్‌ ఇటీవల సంతకం చేసిన కార్యనిర్వహక ఉత్తర్వుల ప్రకారం ముస్లిం మెజార్టీ ఉన్న ఏడు దేశాల నుంచి వలసలదారులను, శరణార్థులు అమెరికాలో ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

వ్యతిరేకించిన బ్రిటన్

వ్యతిరేకించిన బ్రిటన్

రణార్థులపై అమెరికా విధించిన ఆంక్షలను ఆ దేశ మిత్రుడిగా పేరున్న బ్రిటన్‌ కూడా వ్యతిరేకించింది. బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మాట్లాడుతూ.. అమెరికా విధించిన ఆంక్షలు బ్రిటన్‌ పౌరులపై కూడా ప్రభావం చూపవ్చని పేర్కొన్నారు. దీనిని ఖండించటానికి మాత్రం నిరాకరించారు. వారి దేశంలో ఏం పాలసీలు అమలు చేయాలని అనేది ఆ దేశ నిర్ణయమన్నారు.

థెరిస్సా ప్రతినిధి..

థెరిస్సా ప్రతినిధి..

ప్రధాని థెరిస్సా ప్రతినిధి మాట్లాడుతూ... ఇమ్మిగ్రేషన్‌ పాలసీకి సంబంధించి అమెరికా ఇష్టం వచ్చిన విధానాన్ని అవలంభించవచ్చునని, అదే విధంగా మనం చేయవచ్చునని పేర్కొన్నారు. కానీ ఇటువంటి విధానాలను బ్రిటన్‌ స్వాగతించలేదు.. అలాగని స్వీకరించలేదన్నారు.

కిమ్ కర్దాషియన్

కిమ్ కర్దాషియన్

నిత్యం వార్తల్లో నిలిచే అమెరికన్‌ రియాలిటీ స్టార్‌ కిమ్‌ కర్ధాషియన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయంపై స్పందించింది. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పకుండా అమెరికాలో ఏటా తుపాకీ తూటాలకు ఎంతమంది బలవుతున్నారో తెలిపే ఓ పట్టికను ఆమె ట్విట్టర్‌లో రెండు రోజుల క్రితంషేర్‌ చేశారు.

ఇవీ కిమ్ వివరాలు..

ఇవీ కిమ్ వివరాలు..

కిమ్‌ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇస్లామిక్‌ జిహాదీ వలసదారుల చేతుల్లో ఏటా ఇద్దరు అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్నారట. అదే అమెరికాలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గన్‌ కల్చర్‌ కారణంగా 11,737 మంది మరణిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏటా అమెరికన్లు అధికంగా చనిపోతోంది కాల్పుల్లోనేనని అర్థమవుతోంది.

English summary
Barack Obama has spoken out against President Donald Trump’s closure of the US border to immigrants from several Muslim-majority countries, in a startling break with tradition for a former president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X