సింప్లిసిటీకి కేరాఫ్ : అమెరికా అధ్యక్షుడే ఇలా..
హనాయ్ : అనుకోని అతిథి ఆ హోటల్ లో ఆతిథ్యం కోసం అడుగుపెట్టాడు. ఆయనేదో సాదాసీదా వ్యక్తి అయితే, సోషల్ మీడియాలోను, ఇటు జనంలోను ఇంత చర్చ జరిగి ఉండేది కాదేమో..!, ఇప్పుడాయన టాపిక్ సింప్లిసిటీకి కేరాఫ్ గా మారింది. ఆయనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.
అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. వియత్నాంలోని ఓ సాధారణ హోటల్ లో అడుగుపెట్టిన ఒబామా, మిగతా కస్టమర్ల లాగే ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోని తనకు నచ్చిన వియత్నాం స్పెషల్ వంటకం 'బన్ చా' ను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అంతేకాదు, ఆంథోని బుర్డేన్ అనే అదే హోటల్ కి చెందిన షెఫ్ ని తనకు కంపెనీగా కూర్చోబెట్టుకుని కబుర్ల చెప్పుకుంటూ డిష్ ను ఆరగించారు.

సోమవారం రాత్రి ఆ హోటల్ లో డిన్నర్ ముగించుకున్న ఒబామా, ఆ హోటల్ చీఫ్ షెష్ కు ఆరు డాలర్ల చెక్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ షెఫ్ వెల్లడించారు. అధ్యక్షుడితో కలిసి హోటల్ లో దిగిన ఫోటోను షెఫ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది.
ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోని, రుచికరమైన న్యూడుల్స్ ఆరగిస్తూ, చల్లటి బీర్ సేవిస్తున్న ఒబామా అంటూ షెఫ్ ట్వీట్స్ చేశాడు. అయితే, ఒబామా ఆ హోటల్ లో డిన్నర్ చేస్తున్నారని తెలియగానే జనమంతా తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. ఒబామా హోటల్ నుంచి బయటకు రాగానే ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications