US Election Result 2024: హవాయిలో హారిస్ హవా..40 ఏళ్లుగా..!!
అమెరికా అధ్యక్ష్య ఎన్నికల ఫలితాలు క్రమంగా బయటకు వస్తున్నాయి.చాలా చోట్ల ట్రంప్ ముందంజలో కొనసాగుతుండగా పలు చోట్ల పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ఒకే పార్టీకి అక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. అలాంటి రాష్ట్రాల్లో ఒకటి హవాయి. హవాయిలో ఇప్పటి వరకు డెమొక్రాట్ల ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సొంత రాష్ట్రం హవాయి.ఆయన కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. ఇక తాజాగా వెలువడిన ఫలితాల్లో కమలా హ్యారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ మరోసారి విజయం సాధించింది. దీంతో హవాయి రాష్ట్రంలో మళ్లీ డెమొక్రటిక్ పార్టీ జెండా ఎగిరింది.
ఇక అధ్యక్ష్య ఎన్నికల్లో హవాయి రాష్ట్రాన్ని సొంతం చేసుకోవడం డెమొక్రటిక్ పార్టీకి ఇది వరుసగా 10వ సారి.చివరిసారిగా 40 ఏళ్ల క్రితం రిపబ్లిక్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది.1984లో రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో నాడు హవాయి రాష్ట్రాన్ని రిపబ్లిక్ పార్టీ గెలిచింది. ఇక ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీనే ఆధిపత్యం చెలాయించింది.

హవాయి రాష్ట్రం చాలా ప్రత్యేకం. అమెరికా దీవుల్లో ఒక దీవిగా పేరుగాంచిన రాష్ట్రం హవాయి.ఇది మెయిన్‌లాండ్‌కు 2వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హవాయి రాష్ట్రం ద్వీప సమూహరాష్ట్రంగా ప్రసిద్ధిగాంచింది.ఈ రాష్ట్రం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. ఇక ఓటర్ల విషయానికొస్తే వీరంతా వివిధ సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చినవారు.ఇక్కడ జనాభాను పరిశీలిస్తే దాదాపుగా 37శాతం మంది ఆసియా ఖండం నుంచి వచ్చినవారుండగా..25శాతం తెల్లవారు,10శాతం హవాయికి చెందిన వారుగా ఉన్నారు.28శాతం ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
ఇప్పటి వరకు హవాయి రాష్ట్రం నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఒక్క బరాక్ ఒబామానే సేవలందించారు.1961 ఆగష్టు 4న హొనలూలు రాష్ట్రంలో బరాక్ ఒబామా జన్మించారు. ఆయన అమెరికాకు 44వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 నుంచి 2017వరకు వరుసగా రెండు సార్లు ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారు.అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించిన తొలి నల్లజాతీయుడిగా ప్రసిద్ధికెక్కారు.













Click it and Unblock the Notifications