పుల్వామా దాడిని ఖండిస్తూనే వంకరబుద్ధి చాటుకున్న చైనా, మసూద్ అజహర్‌పై అదే వాదన
బీజింగ్/న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా తీవ్రవాద దాడిపై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అదే సమయంలో ఉగ్రవాది మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సమ్మతించడం లేదు. తద్వారా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది.

ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురి చేసింది
భారత్‌లో జరిగిన ఉగ్రదాడి చైనా దృష్టికి వచ్చిందని, ఈ దాడి ఘటన విని మేం తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యామని, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు తాము ఎప్పుడూ కృషి చేస్తామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి మీడియా ద్వారా తెలిపారు.

అజహర్ మీద నిషేధంపై దాటవేత
అదే సమయంలో, మీడియా ప్రతినిధిలు జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పైన ప్రశ్నించారు. అజహర్‌పై భారత్ నిషేధం విధించాలని చేస్తోంది కదా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ కౌన్సిల్ జాబితాలో జేఈఎం కూడా ఉందన,ి ఈ విషయంలో ఆంక్షలు విధించేందుకు చైనా నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతమైన పద్ధతిని అవలంభిస్తోందని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చేర్చేందుకు నిరాకరించింది. అందుకు ఆధారాలు లేవని చెప్పింది.

భారత్ డిమాండ్‌కు నో
ఐక్య రాజ్య సమితిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి అతడిపై నిషేధం విధించాలని భారత్ పలుమార్లు చేసిన ప్రతిపాదనను భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా తిరస్కరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్‌కు అమెరికాతో పాటు పలు దేశాలు మద్దతిచ్చాయి. అయితే మసూద్ ఉగ్రవాది అనేందుకు సరైన కారణాలు చూపించడం లేదని చెప్పుకొస్తూ భారత్ ప్రతిపాదనలను చైనా తిరస్కరిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications