భారీ ఆఫర్: కోరిన విధంగా వీర్యం ఇస్తే.. రూ. 3.5కోట్లు మీవే!
అమెరికాలోని ఓ సంస్థ మాత్రం వీర్యం దానం చేసే వ్యక్తులకు భారీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైంది.
న్యూయార్క్: ఇటీవల కాలంలో వీర్యం ప్రాధాన్యత పెరిగిపోతోంది. పోషకాహారం లోపం, తీవ్రమైన పని ఒత్తిడి, తదితర కారణాలతో వీర్య కణాల సంఖ్య తగ్గిపోయి చాలా మంది సంతానానికి నోచుకోవడం లేదు. వారి కోసం వైద్యులు ఇతరుల వద్ద వీర్యం సేకరించి సంతాన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఇటీవల తెలుగులో ఈ నేపథ్యంలో 'నరుడా డోనరుడా' అనే ఓ సినిమా కూడా వచ్చింది.
ఈ సినిమాలో వీర్యం దానం చేసే వ్యక్తికి వైద్యుడు పెద్ద మొత్తంలోనే డబ్బులు అందజేస్తాడు. కాగా, అమెరికాలోని ఓ సంస్థ మాత్రం వీర్యం దానం చేసే వ్యక్తులకు భారీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వీర్యం.. అండం దానమిచ్చే వారికి కొద్ది మొత్తంలో డబ్బు అందుతుంది. కానీ.. అమెరికాలోని ఆ సంస్థ అన్ని విధాలుగా, జన్యుపరంగా సరైన వ్యక్తి ఇచ్చే వీర్యానికి ఏకంగా రూ. 3.5కోట్లు ఇస్తామని ప్రకటించింది.

జన్యువుల ప్రభావం వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు ఆ విధంగానే ఉంటారు. ఎవరి పిల్లలు వారిలాగే జీవిస్తారు. అయితే సంతానోత్పత్తి లేని వారికి కృత్రిమ గర్భాధారణ జరిపి పిల్లల్ని పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని డెలావర్ ప్రాంతంలోని ప్యురెనెటిక్ ఎల్‌ఎల్‌సీ సంస్థ నాణ్యమైన, మేటి వీర్యం.. అండం కనుగొనాలని భావించింది. ఈ మేరకు పురుషుల్ని వీర్యం.. మహిళల్ని అండాలను దానం చేయమని ఆహ్వానిస్తోంది.
దానం చేయాలనుకునే వారు తొలుత సంస్థ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. దంపతులు గానీ, వేరు వేరు వ్యక్తులు గానీ వారి పేర్లని రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. . ఎంపిక చేసిన వారి నుంచి వీర్యం, అండం సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు.
కాగా, అంతకు ముందే వీర్యం, అండం దానం చేసిన వారి విద్యాబుద్ధులు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితి, డీఎన్‌ఏలను పరిశీలిస్తారు. ఆయా అంశాల్లో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటే వారి నుంచి మాత్రమే వీర్యం.. అండం సేకరించడం జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. ఇలా తమకు కావాల్సిన వీర్యం, అండం దానం చేసిన వారికి రూ. 3.5కోట్ల రూపాయలు అందిస్తామని పేర్కొంది. దీంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications