మళ్లీ పెళ్లి చేసుకో, స్వర్గంలోను భార్యగా నువ్వే: లాడెన్‌లో ఎమోషనల్ కోణం
వాషింగ్టన్: 2011 మే 2న అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతం చేసిన అనంతరం అతని నివాసంలో వేల సంఖ్యలో ఉన్న పత్రాలను అమెరికా నౌకాదళ సైనికులు (సీల్స్) స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాను జీవించి ఉన్నంత వరకు పోరాడుతానని ఆయన పత్రాల్లో వెలుగు చూసింది. అదే సమయంలో ఆ పత్రాల్లో అతని భావోద్వేగం కూడా కనిపించింది.
అతను తన భార్యకు ఎమోషనల్ లేఖ రాశాడు. నేను నీకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని లాడెన్ తన భార్యకు రాసిన లేఖలో పేర్కొన్నాడు.
ఆమె మరో పెళ్లి చేసుకోవచ్చునని ప్రస్తావిస్తూ... తనను లేదా కొత్త భర్తను స్వర్గంలో ఎంచుకోవాలని పేర్కొన్నాడు.

లాడెన్ రాసిన ఆ లేఖ అరబిక్ భాషలో ఉంది. అయితే, ఆయన తన ముగ్గురు భార్యల్లో దానిని ఎవరికి రాసాడనేది కచ్చితంగా తెలియరాలేదు. అయితే, తాను ఎక్కువగా ఇష్టపడే చిన్న భార్యకు ఆ లేఖ రాసి ఉంటాడని భావిస్తున్నారు.
ఆ లేఖలో తనయుడు, ఇద్దరు కూతుళ్ల గురించి అడిగాడు. అంతేకాదు, కొడుకును యుద్ధంలోకి పంపించాలని అందులో పేర్కొన్నాడు. దీంతో మానసికంగా బాధపడుతావని తెలుసునని అన్నాడు.
నీవు నీ కుటుంబాన్ని కలిసి, మళ్లీ పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తున్నానని పేర్కొన్నాడు. సాధ్యమైతే ముజాహిదీన్లు(ఫైటర్స్)కు ఇచ్చి కూతుళ్లను పెళ్లి చేయాలని, కొడుకును యుద్ధ రంగంలోకి పంపించాలని సూచించాడు. నీవు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు నేను అంగీకరిస్తున్నానని, అదే సమయంలో స్వర్గంలో నేను నిన్నే ఎంచుకుంటానని చెప్పాడు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications