కరోనా విరుగుడుకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..?
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ల్యాబోరేటరీల్లో నిరంతర ప్రయోగాల్లో మునిగిపోయారు. వైరస్ జన్యువును విశ్లేషించి.. దానికి విరుగుడు తయారుచేయడంలో వారంతా తలమునకలయ్యారు. అయితే ఎంత వేగంగా ప్రయోగాలు సాగించినా.. వ్యాక్సిన్ తయారీకి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్‌కాక్ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ గ్రూప్,జెన్నెర్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్నాయని చెప్పారు.అంతేకాదు,గురువారం(ఏప్రిల్ 23) నుంచి మనుషులపై దీన్ని ప్రయోగించబోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం..

కరోనాకు విరుగుడు.. ChAdOx1 nCoV-19..
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ గ్రూప్,జెన్నెర్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న ఈ వ్యాక్సిన్‌కు ChAdOx1 nCoV-19 అని నామకరణం చేశారు. 'అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టార్' టెక్నాలజీ ఆధారంగా దీన్ని అభివృద్ది చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కరోనా వైరస్ ఆర్ఎన్ఏ జన్యువును అడెనోవైరస్(కామన్ వైరస్‌లు)లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని తిరిగి మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ చేయవచ్చు. అప్పుడు అడెనోవైరస్ వ్యాక్సిన్ కోడ్స్ లేదా వ్యాక్సిన్ కెమికల్స్‌కు వెక్టార్(క్యారియర్)గా పనిచేస్తుంది. కాబట్టి దానిని అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టార్ అని పిలుస్తారు.

ఎలా పనిచేస్తుంది..
కరోనా వైరస్ బాహ్య అంచులపై గుండ్రటి ముళ్ల(స్పైక్స్) లాంటి ఆకారాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్‌లతో నిర్మింపబడి ఉంటాయి. తాజాగా అభివృద్ది చేస్తున్న ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఈ స్పైక్స్‌ను టార్గెట్ చేస్తుంది. ఒక్కసారి ఈ వ్యాక్సిన్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. అది కరోనా వైరస్ లాంటి యాంటిజెన్స్(స్పైక్స్)ను వృద్ది చేస్తుంది. ఇవి అచ్చు కరోనా స్పైక్స్‌నే అనుకరిస్తాయి. మానవ శరీరం ఈ స్పైక్స్‌ను గుర్తించిన వెంటనే యాంటీబాడీస్(ప్రతినిరోధకాలు)ను విడుదల చేయడం మొదలుపెడుతుంది. ఈ యాంటీబాడీస్ ఆ స్పైక్స్‌పై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. అంతేకాదు, ఈ స్పైక్స్‌పై దాడి చేయడానికి రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను ఎప్పుడూ సిద్దంగా ఉంచుకుంటుంది.

క్లినికల్ ట్రయల్స్
ఒకవేళ నిజమైన వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. వెంటనే యాంటీబాడీస్ విడుదలై.. కరోనా వైరస్‌పై పోరాడుతాయి. ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇంకా అభివృద్ది దశలోనే ఉన్న ఈ వ్యాక్సిన్‌తో బ్రిటన్‌లోని పలుచోట్ల ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 550 మంది వలంటీర్లను బ్రిస్టల్,సౌతాంప్టన్,లండన్ ప్రాంతాల నుంచి రిక్రూట్ చేసుకున్నారు.
Recommended Video
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications