సలసలా మరిగిపోతున్న మహాసముద్రం.. చరిత్రలో తొలిసారి 30 డిగ్రీల వేడి

ఎల్ నినో దెబ్బకి భూగోళంపై ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పసిఫిక్ మహాసముద్రం ఉష్ణోగ్రతలు అసాధారణరీతిలో ఎగబాకి సరికొత్త రికార్డు సృష్టించాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 30 డిగ్రీల సెల్సియస్‌ను తాకడంతో అంతటా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత శక్తివంతంగా మారుతున్న ఈ ఎన్ నినో ప్రభావం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

రికార్డు స్థాయిలో ఎగబాకిన సముద్ర ఉష్ణోగ్రతలు

అమెరికాకు చెందిన నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) వెల్లడించిన సమాచారం ప్రకారం, పసిఫిక్ మహాసముద్ర మధ్య భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అక్టోబర్ 22 నాటికి ఏకంగా 30 డిగ్రీలకు చేరుకుంది. అందుబాటులో ఉన్న రికార్డుల చరిత్రలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ అసాధారణ వేడిమి వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని, అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఇది మరింత తీవ్రరూపం దాల్చి డిసెంబర్ నాటికి తారస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) స్పష్టం చేసింది.

Pacific Ocean Temperatures Touch Record 30 Degree Celsius For First Time As Strong El Nino Intensifies
El Nino: ఉడికిపోతున్న పసిఫిక్ మహాసముద్రం.. ఆల్ టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రత
El Nino: ఉడికిపోతున్న పసిఫిక్ మహాసముద్రం.. ఆల్ టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రత

ఎన్ నినో అంటే ఏమిటి? ఎందుకంత భయం?

పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కే సహజ వాతావరణ ప్రక్రియనే 'ఎన్ నినో' అంటారు. ఈ వేడి గాలి ప్రవాహాలను, వర్షపు మేఘాల కదలికలను పూర్తిగా మార్చివేస్తుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే ఈసారి ఈ పరిమాణం చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా సముద్రపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3.7 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

చుక్క నీరు కూడా దొరకదు! పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు
చుక్క నీరు కూడా దొరకదు! పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు

భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

శక్తివంతంగా మారుతున్న ఈ ఎన్ నినో ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటికే నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నెలల్లో దక్షిణ ఆసియా వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలలో తక్కువ వర్షపాతం పడే ప్రమాదం ఉంది.

ఒక్క ఎన్ నినో మాత్రమే మన దేశ వాతావరణాన్ని శాసించలేకపోయినప్పటికీ, పసిఫిక్ సముద్రం ఇంతలా వేడెక్కడం మాత్రం తీవ్రమైన ఎండలు, అనూహ్య వర్షాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2027 ప్రారంభం వరకు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉండటంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+