వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:షార్క్-సముద్రపు తాబేలు.. మధ్యలో మోస్.. చివరకు ఏం జరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

సముద్రంలో బోటింగ్ అంటే కష్టమే.. సాహసికులు మాత్రమే చేయగలరు. అయితే అప్పుడప్పుడు పెద్ద పెద్ద షార్క్ కనిపిస్తాయి. సో వాటి బారి నుంచి తప్పించుకోవడం అంతా సులువు కాదు. ఆస్ట్రేలియాలో ఓ తెడ్డుపై ఓ యూట్యూబర్ బ్రాడీ మోస్ జర్నీ చేశాడు. ఆ విశేషాలను తీసే సమయంలో షార్క్ వచ్చింది. అదీ తాబేలును చూసింది. ఇంకేముంది ఎగబడింది.. కానీ అంతలో అతని చిన్న బోటుపై కూడా దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.

షార్క్.. తాబేలు కోసం వేటాడుతుంది. మధ్యలో మోస్ చిక్కుకున్నాడు. ఈ క్రమంలో అతని బోటు కుదుపునకు గురయ్యింది కూడా.. ఇంతలో అరుపులు పెడబొబ్బులు కూడా వినిపించాయి. బోటు.. ఇరువైపులా ఆ రెండు కదిలాయి. దీంతో మోస్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నాడు. సముద్రపు తాబేలు కోసం షార్క్ పోరాడుతూనే ఉంది.

Paddleboarder Stuck Between Tiger Shark And Prey

షార్క్‌కు నీటి తాబేలు దొరకలేదు. దీంతో అదీ కోపంతో బోటును కొరికివేసింది. దీంతో కుదుపునకు గురయి.. అందులోంచి మోస్ పడిపోయాడు. వీడియో కూడా ఆగిపోయింది. ఏం జరిగిందా అని ఆలోచించడం యూజర్ల వంతయిపోయింది. కాసేపు బ్లాంక్ కాగా.. ఇసుక కనిపిస్తోంది. తర్వాత మోస్ తిరిగి ఫోన్ తీసుకోగలుగుతాడు. అలా బయటకు వచ్చిన తర్వాత వీడియో ఆగిపోతుంది. సో షార్క్ దాడి వల్ల.. మోస్ తన వీడియో కూడా బాగా చేయలేకపోతాడు.

షార్క్ ఇష్టపడతానని మోస్ తెలిపారు. ఈ వీడియోను ఇప్పటికే 2.92 లక్షల సార్లు వీక్షించారు. మోస్‌ను కొందరు తిట్టి పోశారు. షార్క్.. సముద్రపు చేపను తినాలనుకుందని చెప్పారు. దాని పని కానిస్తే అయిపోయేది అని అంటున్నారు. వాస్తవానికి షార్క్ అంటేనే డేంజర్.. అయినా దాంతో సాహసమే చేశారు. కానీ ఆ వీడియో మాత్రం హైలెట్ అయ్యింది. మరికొందరు గొప్ప ధైర్య వంతుడివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.

English summary
paddleboarder in Australia was recently knocked into the sea when he was stuck in the middle of a chase between a hungry tiger shark and a scared turtle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X