Tarek Fateh:పాక్ మత విధానాలపై గొంతెత్తిన తారేక్ ఫతా ఇక లేరు..!
ప్రముఖ కాలమిస్ట్ మరియు రచయిత తారేక్ ఫతా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి చెందినట్లు కూతురు నటాషా ఫతా ధృవీకరించింది. కొద్ది రోజుల క్రితం ఆయన మృతి చెందినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
There was one and only @TarekFatah - daring, funny, knowledgable, sharp thinker, great orator and a fearless fighter.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 24, 2023
Tarek, my brother, it was a delight to have you as a close friend.
Will you be able to rest in peace?
Om Shanti. pic.twitter.com/X9VcRKtyK4
"పంజాబ్ సింహం, భారత్ ముద్దుబిడ్డ, కెనడాను ప్రేమించిన వ్యక్తి, సత్యం కోసం పాటుపడే వ్యక్తి, న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి, బడుగు బలహీనవర్గాల గొంతుకను వినిపించిన వ్యక్తి ఇక లేరు. తాను భౌతికంగా లేనప్పటికీ తన ఆశయాలు మాత్రం బతికే ఉంటాయి" అంటూ తారేక్ ఫతా కూతురు నటాషా ట్వీట్ చేశారు. ఏప్రిల్ 21నే తారేక్ ఫతా కన్నుమూసినట్లుగా పలు వార్తలు షికారు చేశాయి. అయితే అవి సత్యదూరమని కుటుంబ సభ్యులు ఖండించారు.

తారేక్ ఫతా ఎల్‌జీబీటీ హక్కుల కోసం పోరాడాడు.వారికి అండగా నిలిచాడు.షరియా చట్టాన్ని వ్యతిరేకించాడు. ఇస్లాం మతం యొక్క ప్రగతిశీల రూపం కోసం నినదించారు.తాను పాకిస్తాన్‌లో జన్మించిన భారతీయుడునని, ఇస్లాంలో పుట్టిన పంజాబీ అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవాడు.తారేక్ ఫతా పాకిస్తాన్ మతపరమైన విధానాలను విమర్శించేవాడు. అంతేకాదు 1947లో జరిగిన భారతదేశ విభజనపై కూడా వ్యతిరేకించాడు.
Lion of Punjab.
— Natasha Fatah (@NatashaFatah) April 24, 2023
Son of Hindustan.
Lover of Canada.
Speaker of truth.
Fighter for justice.
Voice of the down-trodden, underdogs, and the oppressed.@TarekFatah has passed the baton on… his revolution will continue with all who knew and loved him.
Will you join us?
1949-2023 pic.twitter.com/j0wIi7cOBF
పాకిస్తాన్‌లోని కరాచీలో ఒక పంజాబీ ముస్లిం కుటుంబంలో తారేక్ ఫతా జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో తన కుటుంబం ముంబైను వీడి కరాచీలో స్థిరపడింది. 1970లో కరాచీ సన్ అనే వార్త సంస్థలో రిపోర్టర్‌గా జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించాడు. 1977లో ఫతాహపై దేశద్రోహం నేరం మోపబడింది. అనంతరం జియా ఉల్ హక్ ప్రభుత్వం జర్నలిజం రంగం నుంచి ఫతాహను నిషేధించింది. దీంతో ఆయన 1987లో కెనాడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సౌదీ అరేబియాలో కూడా ఉన్నారు.

తారేక్ ఫతా మరణించారన్న సంగతి బయట ప్రపంచానికి తెలియగానే సోషల్ మీడియాలో నెటిజెన్లు ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి తరేక్‌తో కలిసి తీసుకున్న ఫోటోలను ట్వీట్ చేస్తూ అలాంటి యోధుడు మళ్లీ పుట్టరని పేర్కొంటూ నివాళులు అర్పించారు. ఇలా చాలామంది ప్రముఖులు తారేక్ ఫతాేకు నివాళులు అర్పించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications