రష్యాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ పర్యటన.. అమెరికా ప్రకటన తర్వాతే, పుతిన్‌తో చర్చలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం చేస్తోంది. దీంతో ప్రపంచ అంతా భయాందోళనకు గురవుతుంది. ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. అయితే ఈ క్రమంలో పరిస్థితి సద్దుమణిగించే బాధ్యతలను ప్రపంచ దేశాలు తీసుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ముందుకు వచ్చారు. ఆయన బుధవారం రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం అయ్యారు. శక్తి ఉత్పాదన గురించి మాట్లాడారు. ఉక్రెయిన్‌కు రష్యా తన సైన్యాన్ని పంపించిన అమెరికా, వెస్ట్రన్ గవర్నమెంట్స్ ఆర్థికపర అంక్షలు విధించాయి. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇమ్రాన్ అండ్ టీం
ఇమ్రాన్ ఖాన్‌తో పాటు విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, సమాచార శాఖమంత్రి ఫావద్ చౌదరి, ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ మంత్రి అసద్ ఉమర్, వాణిజ్య శాఖ సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్, జాతీయ భద్రత సలహాదారు డాక్టర్ మొయిద్ యూసుఫ్.. విదేశాంగ శాఖ సిబ్బంది ఉన్నారు. పుతిన్- ఇమ్రాన్ ఖాన్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వెల్ కం
విమానాశ్రయంలో ఇమ్రాన్ ఖాన్‌కు రష్యా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇగొర్ స్వాగతం పలికారు. ఇద్దరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు.. ఉక్రెయిన్ ఉధృతి గురించి చర్చిస్తారు. శక్తి ఉత్పాదన, జాతీయ, అంతర్జాతీయ సమస్యలు.. ఆప్ఘనిస్తాన్‌లో గల ఇస్లొమోఫోబియా గురించి డిస్కష్ చేస్తారు. ఖాన్ రష్యాలో అడుగిడారో లేదో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ మరుసటి రోజే రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్దం ప్రకటించింది.

దాడులు
ఇటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించేసింది. ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా బాంబు దాడులకు పాల్పడుతోంది. యుద్ధం తమ ఉద్దేశం కాదని చెప్తూ వచ్చిన పుతిన్.. అకస్మాత్తుగా ఉక్రెయిన్‌పై దాడికి దిగారు.
యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు పుతిన్ గట్టి హెచ్చరికలు కూడా చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే.. చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. మీరు నా మాట వింటారని ఆశిస్తున్నట్లు ప్రపంచ దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదని.. ఉక్రెయిన్‌ను సైనిక రహితం చేయడం కోసమేనని తెలిపారు.
Recommended Video

కారణమిదే..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లిట్యా తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ నాయకత్వం నుంచి రష్యా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని కోరారు. ఉద్రిక్తతల గురించి చర్చించే సమయం మించిపోయిందని.. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఒకప్పుడు సోవియెట్ రష్యాలో భాగమైన ఉక్రెయిన్ ఇప్పుడు యురోపియన్ యూనియన్‌కు దగ్గరవడం రష్యాకు ఏమాత్రం మింగుడుపడట్లేదు. ఉక్రెయిన్‌ని తమతో చేర్చుకోమని హామీ ఇవ్వాల్సిందిగా అమెరికా, నాటోని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటో పక్షం చేరవద్దని.. అది తటస్థంగానే ఉండాలని అంటున్నారు. పశ్చిమ దేశాలు పుతిన్ డిమాండ్లను తిరస్కరిస్తున్నాయి. ఉక్రెయిన్ ద్వారా పశ్చిమ దేశాల నుంచి రష్యాకు ముప్పు ఉంటుందని పుతిన్ భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడికి పూనుకున్నారు.












Click it and Unblock the Notifications