వామ్మో.. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు వైరస్
కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాకిస్తాన్‌లోనూ కోరలు చాస్తోంది. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పాజిటివ్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసుకున్న పరీక్షల్లో కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ ప్రకటించారు.
ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని సుల్తాన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ 'సినోవక్'వ్యాక్సిన్ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. పాకిస్తాన్ ప్రధానికి పాజిటివ్ రావడం.. చైనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్ కూడా నాసిరకం అని కామెంట్స్ చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక వైరస్ రావడం ఏంటీ అని అడుగుతున్నారు. చైనా అంటేనే నాసిరకమా అని కొశ్చన్ చేశారు.












Click it and Unblock the Notifications