భారత్ కు బిగ్ షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులు దాడులు చేసి నేటమట్టం చేశాయి. ఈ ఘటనపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్ పై పగ పెంచుకుంది. కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ లతో దాడులకు దిగింది. అయితే ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదరడంతో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.

ఈ క్రమంలో భారత్ కు పాకిస్థాన్ మరో షాక్ ఇచ్చింది. అయితే గతంలో భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పాక్ గగనతలం నుంచి భారత్ విమానాలు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్. అయితే ఈ నిర్ణయాన్ని తాజాగా మరో నెల రోజులపాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భారత్ కు ఆర్థికంగా నష్టంగా భావించవచ్చు.

భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలం నుంచి వెళ్లకుండా పాకిస్థాన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని మరో నెల రోజులపాటు పొడిగిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిషేధానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పాక్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది.

Pakistan Extends Ban on Indian Flights Through Its Airspace

అయితే అంతర్జాతీయ వైమానిక సంస్థ(ICAO) రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకారం ఒక దేశం.. మరో దేశానికి విధించే గగనతలం ఆంక్షలు ఒకేసారి నెల రోజులు కంటే ఎక్కువ కాలం విధించరాదు. పాకిస్థాన్ గతంలో విధించిన ఈ నిషేధం మే 23 వరకు అమల్లో ఉంటుంది. ఆలోపు ఈ నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ పలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ రద్దు.. ఇలా అనేక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే భారత్ పై ప్రతీకారంగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+