సెక్స్ బానిసలుగా..: వెలుగులోకి పాకిస్తాన్ మరో ఘాతుకం
పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ దౌద్ ఖట్టక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరాచీ: పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ దౌద్ ఖట్టక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వందలాది మంది పస్తూన్ యువతులను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
తీవ్రవాద క్యాంపుల ప్రాంతాల్లో ఫండింగ్ చేసేందుకు యువతులను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉమర్ దౌద్ ఖట్టక్.. ఆప్ఘనిస్తాన్‌కు చెందిన పస్తూన్ నాయకుడు. పస్తూన్ వేర్పాటువాద నాయకుడు.

పాకిస్తాన్ సైన్యం స్వాత్, వజీరిస్తాన్ ప్రాంతాలలో ఎన్నో ఇళ్లను నాశనం చేస్తోందని, వందలాది మంది యువతులను కిడ్నాప్ చేసి.. లాహోర్‌లో సెక్స్ బానిసలుగా మారుస్తోందని ఆరోపించారు.
పాకిస్థాన్ తమ ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లు చేపట్టి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ముఖ్యంగా పస్తూన్ యువతులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని, వారిని అపహరించి అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు.
తమ ప్రాంతాల్లో ఇళ్లను కూల్చివేశారని, వారి అకృత్యాలకు భరించలేక ఇప్పటికే అయిదు లక్షల మంది అఫ్గాన్‌కు తరలిపోయారని తెలిపారు. ఈ ఆగడాలన్నింటినీ అడ్డుకునేందుకు త్వరలో పస్తూనిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నెలకొల్పనున్నామని, అందుకు ప్రపంచదేశాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
అంతముందు బెలూచిస్థాన్, గిల్గిట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ అకృత్యాలను, ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పినందుకు కొందరు బెలూచిస్తాన్ నాయకులు మోడీకి అప్పట్లో కృతజ్ఞతలు తెలిపారు.
-
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications