పాకిస్తాన్ ప్రధానిపై ట్రంప్ పొగడ్తలు..

భారత్- పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రకటన చేశారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు పదే పదే కృతజ్ఞతలు తెలిపారని వ్యాఖ్యానించారు. లక్షలాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పారని అన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ భిన్నంగా ఉందని పేర్కొన్నారు.

వైట్‌హౌస్‌లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు ఇచ్చారు. షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనను ఆయన ప్రస్తావించారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడం వల్ల కనీసం 10 మిలియన్ల మంది ప్రాణాలను తాను కాపాడినట్లు షరీఫ్ చెప్పారని గుర్తు చేశారు. తాను జోక్యం చేసుకోకుంటే అది భీకర యుద్ధంగా మారేదని అప్పట్లో షరీఫ్ చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

Pakistan PM Thanked me several times says Donald Trump

నోబెల్ శాంతి బహుమతి లభించకపోవడంపై ట్రంప్ స్పందించారు. భారత్- పాక్ వంటి అనేక సంఘర్షణలను తాను పరిష్కరించానని, అయినప్పటికీ- గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడనని ట్రంప్ స్పష్టం చేశారు. నోబెల్ బహుమతికి తనకంటే అర్హులు చరిత్రలో ఇంకెవరూ లేరని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఆపిన ప్రతి యుద్ధానికి నోబెల్ బహుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దాని కంటే కూడా ప్రజల ప్రాణాలను కాపాడటమే తనకు ముఖ్యమని ట్రంప్ ఉద్ఘాటించారు.

కొందరు అంగీకరించడానికి ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ తేల్చి చెప్పారు. అవన్నీ కూడా ఎవరూ ఆపలేరని అనుకున్న యుద్ధాలేనని, తనకు అవార్డులు, రివార్డులు, బహుమతుల గురించి పట్టింపు లేదని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడటం గురించే ఆలోచిస్తానని, 10 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడానని చెప్పారు. ఇక ముందు కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తితే తాను ఖచ్చింగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+