పనామా బ్రిడ్జిపై భారీ పేలుడు- సీసీటీవీ ఫుటేజీలో
పనామాలోని బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికా సమీపంలో భారీ పేలుడు సంభవించింది. తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. ప్రపంచంలోని కీలక సముద్ర మార్గమైన పనామా కెనాల్ పై నిర్మించిన వంతెన ఇది. ఈ ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. దీనికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ఫ్యూయల్ ట్యాంకర్లలో సంభవించిన పేలుడు దీనికి కారణం. అయినప్పటికీ- అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది.
పనాబా బ్రిడ్జిపై నుంచి వెళ్తోన్న సమయంలో బల్బోవా ఆయిల్ ట్యాంక్ ఫెసిలిటీలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ వెంటనే భారీ శబ్దం చేస్తూ పేలుళ్లు సంభవించాయి. పనామా కాలువ ప్రవేశద్వారంపై ఉన్న బ్రిడ్జి అంతటా మంటలు ఎగిశాయి. సీసీటీవీ ఫుటేజీలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. క్షణాల్లోనే మంటలు బ్రిడ్జిని పూర్తిగా కమ్మేయడం, సినిమాటిక్ గా మంటలు విస్తరించడం ఈ వీడియోల్లో చూడొచ్చు.

పేలుడు వల్ల బ్రిడ్జి ఎంత వరకు ధ్వంసమైందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా కారణాలతో బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేసినట్లు పనామా స్టేట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేలుడు తర్వాత బ్రిడ్జి నాణ్యత, ఇతరత్రా పరిస్థితులపై తనిఖీలు చేపట్టారు. భద్రతలో భాగంగా వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశామని, పబ్లిక్ వర్క్స్ విభాగానికి చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు బ్రిడ్జి నాణ్యతను పరిశీలిస్తోన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సురక్షితమని నిర్ధారించిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
WILD FOOTAGE 🔴
— Open Source Intel (@Osint613) April 6, 2026
A tanker blast near the Bridge of the Americas in Panama City ignited a major fire that spread to 2 additional storage units at the Balboa tank facility. Reports of 3 injuries, no foul play suspected (as of now) pic.twitter.com/GeAcicCVQe
ఈ వంతెన పొడవు 1.6 కిలోమీటర్లు. బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికా గా పిలుస్తారు దీన్ని. పనామా నగరాన్ని వాణిజ్య మార్గాలు, కెనాల్ తో కలిపే ముఖ్యమైన రవాణా లింక్ బ్రిడ్జి ఇది. పనామా కాలువ ప్రపంచంలోనే కీలక షిప్పింగ్ ఛోక్‌పాయింట్. హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు సాంప్రదాయ ట్యాంకర్ మార్గాలను ప్రభావితం చేయడంతో, ఈ కాలువ ద్వారా రవాణా పెరిగింది. అమెరికా ముడి చమురు రవాణా కూడా దీనిగుండా ఆసియా వైపు మళ్లించారు.












Click it and Unblock the Notifications