'యేల్'కు రూ.334కోట్లకి పైగా ఇంద్రానూయీ విరాళం!
న్యూయార్క్: ప్రవాస భారతీయురాలు, పెప్సీకో కంపెనీ సీఈవో ఇంద్రా నూయీ తాను చదువుకున్న యేల్ విశ్వవిద్యాలయానికి భారీ విరాళం ప్రకటించారు. ఆమె ఎంత ఇచ్చారనేది స్పష్టంగా తెలియనప్పటికీ దాదాపు రూ.334 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు ఇప్పటి దాకా అందిన అతిపెద్ద విరాళం రూ.334 కోట్లు కాగా... ఇంద్రా నూయీ ప్రస్తుతం ఇంతకన్నా ఎక్కువ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పూర్వ విద్యార్థుల నుంచి వచ్చిన విరాళాల్లో ఇదే అతిపెద్ద మొత్తమని, ఇంద్రా నూయీ ‘అత్యంత ఉదారత గల పూర్వ విద్యార్థి' అని యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా స్కూల్ డీన్‌షిప్‌ను ఇంద్రా నూయీ గౌరవార్థం ప్రకటించారు.

ఒక ప్రముఖ బిజినెస్ స్కూల్‌లో డీన్‌షిప్‌ను పొందిన తొలి మహిళగా ఇంద్రా నూయీ రికార్డులకెక్కారు. ఇంద్రా నూయీ 1980లో యేల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు.
ఆమె నాటి రోజులు గుర్తు చేసుకుంటూ... ఇప్పటి జీవితానికి పునాది అక్కడే పడిందని, నాయకత్వ నిర్వచనాన్ని విస్తృత స్థాయిలో సమీక్షించడానికి అవకాశం లభించిందని, సమాజాన్ని, వ్యాపారాన్ని కలిపి చూడడం అక్కడే అలవాటైందని ఆమె ఓ ప్రకటనలో చెప్పారు. గతంలోనూ పలు నిర్మాణాలకు ఇంద్రా నూయీ సాయం చేశారు. ఆమె పేరిట ఒక తరగతి గది కూడా అక్కడ ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications