గాలిలో విమానం.. మహిళకు డెలివరీ చేసిన పైలట్; తల్లీ, బిడ్డ సేఫ్
తైవాన్: ఓ పైలట్ వైద్యుడిగా మారాడు. విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి విమాన పైలట్ విజయవంతంగా డెలివరీ చేశారు. దీంతో ఆ తల్లీ, బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు. ఈ అనూహ్య ఘటన తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న వీట్‌జెట్‌కు చెందిన విమానంలో జరిగింది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో ఒక గర్భిణి ప్రయాణిస్తోంది. అయితే, టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్రూమ్లో ఆమెను చూసిన సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ జాకరిన్‌కు తెలియజేశారు. ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో గర్భిణికి డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమయానికి విమానంలో వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పైలట్ తల్లీబిడ్డలను కాపాడే ప్రయత్నం చేశారు. ముందుగా తన బాధ్యతలను కో-పైలట్‌కు అప్పగించారు. సెల్‌ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్, వారి సూచనలతో గర్భిణికి విజయవంతంగా పురుడు పోశారు. దీంతో తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో పైలట్ జాకరిన్‌పైప్రయాణికులంతా ప్రశంసలు కురిపించారు. విమానంలో జన్మించిన ఈ చిన్నారికి సిబ్బంది ముద్దుగా 'స్కై' అని పేరు పెట్టడం విశేషం. ల్యాండింగ్ అనంతరం తల్లీబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదన్నారు.
కాగా, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ 2020లో చేసిన అధ్యయనం ప్రకారం.. 1929 నుంచి 2018 మధ్య వివిధ విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తం విమానంలో 74 మంది చిన్నారులు జన్మించగా అందులో 71 మంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications