Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రిక్స్ సహకారం కొనసాగాలి - ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదం : ప్రధాని మోదీ..!!

బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ప్రజల జీవితాలపైన సానుకూల ప్రభావానికి దోహద పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ గా హాజరై ప్రసంగించారు. కరోనా ఇప్పటికీ ప్రపంచ ఆర్దిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. బ్రిక్స్ దేశాల పరస్పర సహకారం దీనిని అధిగమించటానికి తోడ్పడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌ ఎకానమీ నిర్వహణ విషయంలో కూటమి దేశాల విధానాల మధ్య సారూపత్య ఉండటం విశేషం. మన 'న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు' సభ్యత్వాలు పెరగడం మరో శుభపరిణామం గా ప్రధాని అభివర్ణించారు.

తాజా చర్చల్లో వచ్చిన సూచనలతో బ్రిక్స్ మరింత బలోపేతమవుతుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని చెప్పారు. బ్రిక్స్‌ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఇలాంటి చర్యల ద్వారా ప్రత్యేక అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పరిశోధన-అభివృద్ధి, ఔషధ ఉత్పత్తులను పరస్పరం గుర్తించుకోవడం వంటి చర్యలే ఇందుకు ఉదాహరణగా వివరించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా కూడా పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు అమెరికాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. పారదర్శకంగా వ్యవహరిస్తూ ఐక్యతను చాటుకుందామని పిలుపునిచ్చారు. ఏకపక్ష ఆంక్షలను, ఆధిపత్యాన్ని, బెదిరింపులను, విభజనను వ్యతిరేకిద్దామంటూ సూచించారు.

PM Modi said BRICS members have similar approach to governance of global economy

రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా తో పాటుగా మిత్ర దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. కొన్ని దేశాల అనాలోచిత చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. భద్రత, సుస్థిరాభివృద్ధి, ప్రజల శ్రేయస్సును కాంక్షించి బ్రిక్స్‌ దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాక్సిన్లను సమానంగా పంపిణీ చేయాలని బ్రిక్స్‌ దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోషిస్తున్న పాత్రకు మద్దతు పలుకుతున్నామంటూ 'బీజింగ్‌ డిక్లరేషన్‌'లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌ సమస్యలను చర్చించిన నేతలు... వీటిని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తీర్మానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+