Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PMModi : ఏకాకిగా పాకిస్థాన్..? భారత్ దెబ్బ అదుర్స్ కదూ..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేపటిక్రితమే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లో ల్యాండ్ అయ్యారు. 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రోటోకాల్ పక్కనపెట్టి తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అయితే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ పర్యటన ఇప్పుడు పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

అయితే ఈ పర్యటనలో భారత్- ఇజ్రాయెల్ మధ్య ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI), డిఫెన్స్, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో పలు ఒప్పందాలు జరగనున్నాయి. భారత్-ఇజ్రాయెల్ మైత్రిని 'హెక్సాగన్ ఆఫ్ అలయన్స్' గా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంట్ లో నెతన్యాహు మాట్లాడుతూ.. 'హెక్సాగన్ ఆఫ్ అలయన్స్' పై కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు కూటమిగా మారాలని అన్నారు. ఇందులో భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, మెడిటేరియన్ దేశాలు(గ్రీస్, సిప్రస్), అలాగే ఆసియాలోని పలు దేశాలు ఉండాలని అభిప్రాయం తెలిపారు. అయితే ఈ కూటమి గురించి ఇప్పుడే పూర్తిగా వెల్లడికాదని.. సమయం ప్రకారం ఇందుకు సంబంధించిన విషయాలను తాను వెల్లడిస్తానని అన్నారు.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో క్రమంగా పెరుగుతున్న తీవ్రవాద శక్తులను ఎదుర్కోవడం. ముఖ్యంగా ఇరాన్ నేతృత్వంలోని షియా, సున్నీ తీవ్రవాద గ్రూపుల ప్రభావాన్ని తగ్గించడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం అని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఈ 'హెక్సాగన్ ఆఫ్ అలయన్స్' లో భారత్ ను కలపడంపై పాకిస్థాన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ సెనేట్ దీనిని వ్యతిరేకిస్తూ రిజల్యూషన్ పాస్ చేసింది. ఈ కూటమి ప్రాంతీయ శాంతికి అలాగే స్థిరత్వానికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించింది.

PMModi in Israel India Joins Hexagon Alliance Pakistan Faces Isolation and Turmoil Danger

మరోవైపు భారత్- ఇజ్రాయెల్ మైత్రిని పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని స్పష్టం అవుతోంది. వీరి మైత్రి ఇస్లామిక్ దేశాలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని మునీర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. భారత్ తో పాటు అటు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ తో సంబంధాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇక పాకిస్థాన్ ఒంటరి అవుతుందన్న ఆందోళన అసిమ్ మునీర్, పాక్ యంత్రాంగంలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+