నైట్ క్లబ్ లో తల్లి జల్సా: ఏడుస్తున్న చెల్లిని చంపేశాడు

బర్నింగ్ హోమ్: నైట్ క్లబ్ లో జల్సా చెయ్యడానికి తల్లి వెళ్లింది. పోతూపోతూ ఆమె ఒక సంవత్సరం వయస్సు ఉన్న కుమార్తెను ఎనిమిదేళ్ల కుమారుడికి అప్పగించి వెళ్లింది. అయితే తిరిగి వచ్చే సమయానికి కుమార్తె శవమై కనిపించింది.

బర్నింగ్ హోమ్ లో నివాసం ఉంటున్న కాటెర్రా లెవిస్ అనే మహిళకు ఎనిమిదేళ్ల కుమారుడు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న కిల్చి లెవిస్ అనే కుమార్తె ఉన్నారు. ఈమె నైట్ క్లబ్ లకు వెళుతుంది. నైట్ క్లబ్ లకు వెళ్లడం ఆమెకు వ్యసనం అయిపోయింది.

నైట్ క్లబ్ కు వెళుతున్న సమయంలో తన కుమార్తెను ఎనిమిదేళ్ల కుమారుడిని అప్పగించింది. తాను వచ్చే వరకూ పాపను జాగ్రత్తగా చూసుకోవాలని కుమారుడికి చెప్పింది. అయితే ఆమె వెళ్లిన తరువాత పాప ఏడుపు మొదలు పెట్టింది.

 Police charge 8-year-old with murder in death of 1-year-old in Barmingham

బాలుడు చెల్లిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. అయితే పాప అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. సహనం కొల్పోయిన బాలుడు తన చెల్లిని పదేపదే కొట్టడంతో పాప మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు తల్లి మీద మండిపడ్డారు.

బాలుడితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లి కాటెర్రా లెవిస్ మీద కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. బాలుడు ప్రస్తుతం అలబామాలో చైల్డ్ వెల్ఫేర్ ఎజెన్సీలో ఉన్నాడని, తల్లి కుమారుడి మీద నేరం రుజువు అయితే కచ్చితంగా శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+