దొంగతో పోలీస్ శృంగారం.. ప్రభుత్వం వాహనంలోనే కార్యం కానిచ్చేశాడు (వీడియో)
అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక పోలీస్ ఆఫీసర్ విధి నిర్వహణలో ఉన్నప్పుడు దొంగతో శృంగారంలో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాలిఫోర్నియాలోని సాన్ డియాగో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ హెయిర్ అనే వ్యక్తి, పెట్రోలింగ్ సమయంలో ఒక మహిళా దొంగతో శృంగారంలో పాల్గొని అడ్డంగా దొరికిపోయాడు. కారు దొంగతనం కేసులో ఆమెను అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వారిద్దరూ పోలీస్ వాహనంలోనే గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై విచారణ జరిపినప్పుడు, సదరు ఆఫీసర్ హెయిర్ వింత వివరణ ఇచ్చాడు. ఆమెను తనిఖీ చేస్తుండగా పోలీస్ వాహనం డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయిందని, దాన్ని తెరిచేందుకు ఒక గంట పాటు ప్రయత్నించానని, అందుకోసం తన బెల్ట్‌ను ఉపయోగించానని చెప్పాడు. తమ మధ్య ఎలాంటి శృంగారం జరగలేదని వివరణ ఇచ్చాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయడం
అయితే, ఈ కేసును పరిశీలించిన అధికారులు బాడీ కెమెరా రికార్డింగ్‌లు , ఇతర ఆధారాలను పరిశీలించారు. బాడీ కెమెరా కావాలనే ఆపరేటర్ ఆఫ్ చేశాడని నిర్ధారించారు. అంతేకాకుండా, అతని బెల్ట్‌పై సీమెన్ ఆనవాళ్లు లభించడంతో అతను కచ్చితంగా లైంగికంగా కలిశాడని తేలింది. ఈ ఆధారాలతో డిపార్ట్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు హెయిర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మరోవైపు ఆ మహిళా దొంగ కూడా ఈ విషయంపై స్పందించింది. ఆ పోలీస్ ఆఫీసర్ తనతో గడపాలని ఉందని ఫ్లర్ట్ చేశాడని, కానీ శారీరకంగా కలవాలని తాను చెప్పలేదని ఆమె వివరణ ఇచ్చింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది.












Click it and Unblock the Notifications