'ట్రంప్‌తో లైంగిక సంబంధాలు నిజమే, ఇవాంకా మాదిరిగా ఉన్నావని కితాబు'

న్యూయార్క్ :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధాలున్నాయని ఫోర్న్‌సార్ట్ స్టెఫానీ క్లిపార్డ్ ధృవీకరించింది. ట్రంప్‌తో క్లిఫార్డ్‌కు లైంగిక సంబంధాలున్నాయనే విషయమై వచ్చిన వార్తలను వైట్‌హౌజ్ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో ఈ కథనం ప్రచురించడంతో వైట్‌హౌజ్ ఖండించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలను చేపట్టిన తర్వాత అనేక సంచలనాలు చోటుచేసుకొంటున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా భాద్యతలను స్వీకరించిన తర్వాత ఆయనను పదవి నుండి దిగిపోవాలంటూ నిరసనలు కూడ వ్యక్తమయ్యాయి.

ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు కూడ సంచలనాలు సృష్టించాయి. కొన్ని నిర్ణయాలు వివాదాలకు కూడ కారణమయ్యాయి. అయితే తాజాగా ఫోర్న్‌స్టార్ తో ట్రంప్‌ సంబంధాలు తెరమీదికి రావడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్‌తో లైంగిక సంబంధాలు నిజమే

ట్రంప్‌తో లైంగిక సంబంధాలు నిజమే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్న మాట నిజమేనని అడల్ట్‌ సినీతార స్టెఫానీ క్లిఫార్డ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఇన్ టచ్ అనే టాబ్లాయిడ్ ఈ విషయమై క్లిఫార్డ్ ఇంటర్వ్యూను ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె ధృవీకరించింది.

మెలానియా డెలీవరికి ముందే

మెలానియా డెలీవరికి ముందే

మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్‌ పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్‌ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అప్రెంటిస్‌ షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్‌ కూడా చేశాడని క్లిపార్డ్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.

ఇవాంకా మాదిరిగా ఉంటావని

ఇవాంకా మాదిరిగా ఉంటావని

తనను ట్రంప్ ఇవాంకా మాదిరిగా అందంగా ఉంటావని కితాబు ఇచ్చాడని క్లిపార్డ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కోంది.కొంతకాలమే కొనసాగిన తమ బం‍ధం సరదాగా సాగిపోయిందని క్లిపార్డ్ గుర్తు చేసుకొన్నారు.

 ఎన్నికల సమయంలో బయటపడకుండా

ఎన్నికల సమయంలో బయటపడకుండా

2016లో ఎన్నికల సమయంలో స్టార్మీ డానియెల్‌గా పేరొందిన క్లిఫార్డ్ తమ మధ్య ఎఫైర్‌ను బయటపెట్టకుండా ఉండేందుకు తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లను చెల్లించాడని గత వారం వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది ఈ కథనాన్ని వైట్‌హౌజ్ ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+