ఏం మాట్లాడుతున్నారు.. సేఫ్టీ పిన్ రూ.69 వేలా ??
వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రోజుకో కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నాయి. ప్రతిరోజూ ఉపయోగించే సాధారణ వస్తువులను లగ్జరీ ప్రొడక్టులుగా మార్చే ట్రెండ్‌ను ప్రపంచ ఫ్యాషన్ హౌస్‌లు విస్తృతంగా అనుసరిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఫ్యాషన్ యాక్సెసరీస్‌కి పరిమితమైన డిజైనర్ బ్రాండ్‌లు.. ఇప్పుడు ఏకంగా పేపర్ బ్యాగులు, నీళ్ల బాటిల్లు, చెప్పులు, లంచ్‌బాక్స్‌లు సహా రోజూ వాడే వస్తువులకే భారీ ధరలు పెట్టి మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా (Prada) విడుదల చేసిన ఒక సేఫ్టీ పిన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సేఫ్టీ పిన్ ధర రూ.69,000!
ప్రాడా తాజాగా "క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్ (Crochet Safety Pin Brooch)" పేరుతో విడుదల చేసిన ఉత్పత్తి ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాన్ని రేపింది. ఈ చిన్న పిన్ ధరే పెద్ద షాక్ - $775 (సుమారు ₹68,758)! సాధారణంగా ₹20-₹50కే 20-30 పిన్‌లు ఉండే ప్యాకెట్ దొరుకుతుంది. కానీ అదే వస్తువుకు ఇంత భారీ మొత్తంలో పెట్టి ప్రాడా లగ్జరీ యాక్సెసరీగా మార్కెట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

పిన్ ప్రత్యేకత ఏంటంటే..
ఈ పిన రంగురంగుల క్రోచెట్ దారాలతో చుట్టబడి ఉండి, చివరలో ప్రాడా సొంతమైన ట్రయాంగిల్ లోగో చార్మ్ ఉంటుంది. అదే బ్రాండ్ విలువను పెంచే సింబల్‌గా పరిగణించబడుతోంది.
సోషల్ మీడియాలో ప్రాడాపై ఆగ్రహం..
ఈ పిన్ ధర బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో వ్యంగ్యాలు, విమర్శల వరద మొదలైంది. చాలా మంది నెటిజన్లు "ప్రాడా మమ్మల్ని ఆటపట్టిస్తున్నదా?" అంటూ ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్ పేజీ BlackSwanSazy ఒక వీడియోలో ఈ ఉత్పత్తిపై హాస్యాత్మక రియాక్షన్ ఇచ్చింది. అందులో ఒక మహిళ ఆశ్చర్యపోతూ ఇది $775 విలువైన సేఫ్టీ పిన్ బ్రూచ్! నేను ధనవంతులను అడుగుతున్నాను.. మీ డబ్బుతో మీరు అసలు ఏం చేస్తున్నారు? మీకు ఏమి చేయాలో తెలియకపోతే మాకు చాలా ఐడియాలు ఉన్నాయి అంటూ రాసుకొచ్చారు.
అయితే ప్రాడా ప్రొడక్ట్స్‌పై ఇలాంటి విమర్శలు కొత్తవేమీ కావు. గతంలో మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో భారత సంప్రదాయమైన కోల్హాపురి చెప్పులు పోలిన డిజైన్‌ను "లెదర్ సాండల్స్" పేరుతో ప్రదర్శించడం కూడా పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత భారతదేశంలో నిజమైన కోల్హాపురి చెప్పుల అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి. అదే విధంగా ఇప్పుడు ప్రాడా సేఫ్టీ పిన్ వివాదం కూడా స్థానికంగా తయారయ్యే హ్యాండ్మేడ్ యాక్సెసరీస్‌కి మరింత ప్రాధాన్యతను తెచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి ప్రాడా పిన్ ఉదంతం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. రోజువారీ అవసరాల వస్తువులను కేవలం బ్రాండ్ ట్యాగ్, లోగో, ప్యాకేజింగ్ వల్ల వేల రూపాయల ధరకు అమ్మడం సమంజసమా? అని ప్రశ్నిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications