Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు: బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

బ్రిటన్ రాజకుటుంబంలో తీవ్ర కలకలం రేగుతోంది. కింగ్ చార్లెస్ సోదరుడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అనుమానంతో సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంలో ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ఆయన తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న రోజే ఈ అరెస్ట్ జరగడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.

పుట్టినరోజు నాడే పోలీసుల మెరుపు దాడి:
గురువారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో థేమ్స్ వ్యాలీ పోలీసులు సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆండ్రూ నివాసం 'వుడ్ ఫామ్'కు చేరుకున్నారు. గుర్తులు లేని ఆరు పోలీసు వాహనాల్లో వచ్చిన పౌర దుస్తుల్లోని అధికారులు ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం నిందితుడి పేరును పోలీసులు అధికారికంగా వెల్లడించనప్పటికీ.. "నార్ఫోక్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశాం" అని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే బెర్క్‌షైర్, నార్ఫోక్‌లోని ఆయనకు సంబంధించిన నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Prince Andrew Arrested Over Epstein Ties Controversy Strikes UK Royal Family Again

సంచలనం సృష్టిస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ఆరోపణలు:
ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన సుమారు 30 లక్షల పేజీల 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ఆండ్రూ మెడకు చుట్టుకున్నాయి. 2010లో ఆండ్రూ బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా పనిచేస్తున్న సమయంలో.. సింగపూర్, వియత్నాం, హాంగ్‌కాంగ్‌లలో తన పర్యటనలకు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రభుత్వ నివేదికలను ఎప్‌స్టీన్‌కు పంపినట్లు ఈ ఫైల్స్ ద్వారా బయటపడింది. పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా ఆయన ఎప్‌స్టీన్‌తో పంచుకున్నట్లు ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నివేదికలపై సుదీర్ఘంగా సమీక్షించిన థేమ్స్ వ్యాలీ పోలీసులు.. ఆండ్రూ తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశారని నిర్ధారించుకున్నాకే ఈ అరెస్టుకు పూనుకున్నారు.

చట్టానికి ఎవరూ అతీతులు కారు - ప్రధాని స్పందన:
ఈ అరెస్టుపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఘాటుగా స్పందించారు. "మన వ్యవస్థలో చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎవరైనా సరే చట్టం ముందు సమానమే" అని ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళలపై హింస లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర ఉన్నా.. వారు ఎంతటి వారైనా సరే బయటకు వచ్చి దర్యాప్తుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకుటుంబాన్ని మరింత ఇరకాటంలో నెట్టాయి.

అభిశంసన నుంచి అరెస్ట్ వరకు..:
ఆండ్రూకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న అనుబంధం గత కొన్నేళ్లుగా రాజకుటుంబ పరువును తీస్తూనే ఉంది. 2022లో వర్జీనియా గిఫ్రీ అనే మహిళ చేసిన లైంగిక ఆరోపణల కేసును ఆయన భారీ మొత్తంలో డబ్బు చెల్లించి కోర్టు బయటే సెటిల్ చేసుకున్నారు. అయినప్పటికీ.. కింగ్ చార్లెస్ ఇప్పటికే తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. 2025లోనే ఆండ్రూ రాజ బిరుదులను తొలగించడమే కాకుండా, అధికారిక నివాసం నుండి కూడా ఆయనను వెళ్లగొట్టారు. ఇప్పుడు తాజా అరెస్టుతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే, బ్రిటన్ చట్టాల ప్రకారం ఈ నేరానికి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+