క్రైస్ట్ చర్చ్ ఘటనకు ప్రతీకారంగా ఆత్మాహూతి దాడులు: శ్రీలంక రక్షణమంత్రి: తౌహీత్ జమాత్ పై నిషేధం?
కొలంబో: రెండు నెలల కిందట న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో రెండు మసీదులపై ఇద్దరు వ్యక్తులకు కాల్పులకు తెగబడిన ఘటనకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్నాయని ఆ దేశ ప్రభుత్వం నిర్ధారించింది. పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన దర్యాప్తు సందర్భంగా ప్రాథమికంగా ఈ విషయం తేలిందని శ్రీలంక రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజెవర్ధనే స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ లో ఆయన ఓ ప్రకటన చేశారు. ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్న అనంతరం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన పార్లమెంట్ లో ప్రసంగించారు. ఆత్మాహూతి దాడుల నేపథ్యంలో.. తీసుకోవాల్సిన చర్యలపై శ్రీలంక పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది.
కిందటి నెల 15వ తేదీన న్యూజీలాండ్ క్రైస్ట్ చర్చ్ లో రెండు మసీదులపై ఇద్దరు సాయుధులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇద్దరు సాయుధులు రెండు మసీదుల్లో తుపాకులతో చొరపడి, ప్రార్థనల్లో నిమగ్నమైన వారిపై విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించారు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే న్యూజీలాండ్ తుపాకీ సంసృతి కనిపించడం, పైగా మసీదులపై దాడులు చేయడం చర్చనీయాంశమైంది.

ఆ ఘటనకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు జరిగినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్వయంగా ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేశారు. దాడుల అనంతరం తాము 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారిలో సిరియా జాతీయుడొకరు ఉన్నారని రువాన్ తెలిపారు. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, దాడులకు ప్రధాన సూత్రధారిని పట్టుకుని తీరుతామని ఆయన చెప్పారు.
నేషనల్ తౌహీత్ జమాత్ పై నిషేధానికి ప్రతిపాదన..
ర్యాడికల్ భావాలు గల వ్యక్తులతో ఏర్పాటైన నేషనల్ తౌహీత్ జమాత్ సంస్థపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని రువాన్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపాదించారు. గతంలోనూ తౌహీత్ జమాత్ సంస్థ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉండొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తౌహీత్ జమాత్ కార్యకలాపాలను నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రతిపాదించారు. దీనిపై శ్రీలంక పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications