ఇదేం విడ్డూరం.. టూరిస్ట్ స్పాట్‌గా పబ్లిక్ టాయిలెట్ !
పర్యాటకులు సాధారణంగా చారిత్రక కట్టడాలు, ప్రకృతి సౌందర్యం, వినోద ప్రదేశాలను చూడటానికి వెళ్తారు. అయితే చైనాలో మాత్రం ఒక పబ్లిక్ టాయిలెట్ పర్యాటక ప్రాంతంగా మారింది. గన్సు ప్రావిన్స్‌లోని దున్‌హువాంగ్ నైట్ మార్కెట్ వద్ద ఉన్న ఈ మరుగుదొడ్డి.. ఇప్పుడు స్థానికులను మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను సైతం ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఈ టాయిలెట్‌ను ప్రసిద్ధ సిల్క్ రోడ్ నగరం.. ప్రపంచ వారసత్వ కట్టడమైన మొగావో గుహల ప్రదేశానికి దగ్గరగా నిర్మించారు. దీనికి "దున్‌హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్" అని పేరు పెట్టారు. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ రెండు అంతస్తుల ఆధునిక మరుగుదొడ్డి, కేవలం ఉపయోగం కోసం కాకుండా ఒక సాంస్కృతిక కేంద్రంలా రూపుదిద్దుకుంది.

ప్రత్యేక డిజైన్, థీమ్‌లు..
టాయిలెట్ లోపలి గోడలపై దున్‌హువాంగ్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, కళా రూపాలు ఉండగా.. పై అంతస్తు "ఫాంటసీ వరల్డ్" థీమ్ తో అలంకరించబడింది. ఇక్కడికి వచ్చే వారు ఒక మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీలో ఉన్నట్టు అనిపించేలా డిజైన్ చేశారు. దాంతో చాలామంది సందర్శకులు సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.
ఆధునిక సౌకర్యాలు..
- తల్లులు, పిల్లల కోసం యాంటీ-బ్యాక్టీరియల్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లతో ప్రత్యేక గది
- వృద్ధులు, వికలాంగుల కోసం సులభంగా చేరుకునే మార్గాలు, కూర్చునే సీట్లు
- డ్రింక్ డిస్పెన్సర్‌లు, విశ్రాంతి తీసుకునే చోట్లతో విస్తృత స్థలం
- ప్రతి స్టాల్ బయట టైమర్ డిస్‌ప్లే ఉంటుంది. ఎవరైనా ఐదు నిమిషాలకు మించి లోపల ఉంటే, ఆ డిస్‌ప్లే రంగు మారి హెచ్చరిక ఇస్తుంది.
ఈ ప్రత్యేకమైన టాయిలెట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక సందర్శకురాలు తన అనుభవాన్ని పంచుకుంటూ, "నైట్ మార్కెట్‌లో టాయిలెట్ కోసం వెతుకుతూ, పొరపాటున కొత్త గుహలోకి వచ్చాననిపించింది" అన్నారు. మరొకరు "ఇంత విలాసవంతమైన పబ్లిక్ టాయిలెట్ జీవితంలో చూడలేదు" అని వ్యాఖ్యానించారు. ఈ మరుగుదొడ్డి రోజువారీగా వేలాదిమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనివల్ల నైట్ మార్కెట్‌లో వ్యాపారం పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది. చిన్న చిన్న షాపులు, రెస్టారెంట్లు మరింత ఆదాయం పొందుతున్నాయి.
A restroom in Dunhuang敦煌, an ancient oasis city and strategically vital hub on China's Silk Road, famous for the Mogao Caves.
— China in Pictures (@tongbingxue) September 5, 2025
A blend of traditional Yardang landforms and cave art, yet equipped with a modern smart management system that even displays which stall is occupied… pic.twitter.com/ERJnSOPuUH
దున్‌హువాంగ్ పర్యాటక కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ భావిస్తోంది. చైనా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా "టూరిజం ఫ్రెండ్లీ పబ్లిక్ టాయిలెట్లు" నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇది అందుకు ఒక విజయవంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ టాయిలెట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications