పది రోజులుగా అధ్యక్షుడు అదృశ్యం, జోరుగా పుకార్లు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు పది రోజులుగా ప్రజలకు కనిపించడం లేదు. ఆయన అధికారిక కార్యక్రమాలను ఇటీవలి కాలంలో రద్దయ్యాయి. ముందుగానే నిర్ణయించిన కజకిస్తాన్ పర్యటనను విరమించుకున్నారు. దక్షిణాసియా ప్రతినిధి బృందంతో చేసుకోవాల్సిన ఒప్పందాన్ని వాయిదా వేసుకున్నారు.
రష్యా దేశీయ నిఘా బృందం ఎఫ్ఎస్‌బీ ఉన్నతాధికారుల వార్షిక సమావేశానికి ఎప్పుడూ హాజరయ్యే పుతున్న ఈసారి కనిపించలేదు. ఈ విధంగా అధ్యక్షుడు అకస్మాత్తుగా అదృశ్యం కావటంపై రష్యాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మాస్కోలో విజృంభించిన ఫ్లూ జ్వరం ఆయనకు కూడా సోకిందని, గుండెపోటు వచ్చిందని, మరణించారని పుకార్లు వ్యాపించాయి. వీటిపై అధ్యక్షుడి అధికార ప్రతినిధి స్పందించారు. పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నరని, బయటకు కనిపించకపోయినా అంతర్గతంగా జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. కాగా, పుతిన్ సోమవారం నాడు పబ్లిక్ మీటింగులో పాల్గొనవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, స్విస్ మీడియా వ్లాదిమిర్ పుతిన్ గర్ల్ ఫ్రెండ్ గురించి, ఆయన కూతురు గురించి శనివారం రాసింది. పుతిన్ యంగ్ గర్ల్ ఫ్రెండ్ ఎలీనా కబీవా దాదాపు రెండు వారాల క్రితం కూతురుకు జన్మనిచ్చింది. స్విట్జర్లాండులోని సంత్ అన్నా క్లినికాలో జన్మించింది.












Click it and Unblock the Notifications