పుతిన్‌కు షాక్: రహస్యంగా మాజీ భార్య రెండో పెళ్లి
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాజీ భార్య లుద్మిలా పుతిన్ రెండో పెళ్లి చేసుకుందన్న వార్తలు ఇప్పుడు ఆ దేశంలో చక్కెర్లు కొడుతున్నాయి. 58 ఏళ్ల లుద్మిలా తన కన్నా 20 ఏళ్లు తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కూడా రహస్యంగా జరిగింది.
లుద్మిలా రెండో పెళ్లి తర్వాత తన ఇంటి పేరును కూడా మార్చుకుందని స్థానిక వెబ్‌సైట్ ఓ కథనంలో పేర్కొంది. రష్యా ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్స్‌కు 37 ఏళ్ల ఆర్థర్ అచరెంటీ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆర్థర్‌తో ఇటీవల పుతిన్ మాజీ భార్య దిగిన ఫోటోలు ఇటీవల రష్యాలో పెద్ద చర్చాంశంగా మారాయి.
పుతిన్ మాజీ భార్య లుద్మిలా మాత్రం తన కొత్త భాగస్వామితో సెయింట్ పీటర్స్‌బర్గ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. రష్యా నిబంధనల ప్రకారం ఆ దేశంలో మ్యారేజ్ సర్టిఫికెట్‌ను బయటపెట్టరు. దీంతో లుద్మిలా రెండో వివాహంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్తలపై రష్యా ప్రభుత్వం వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.

వ్లాదిమిర్ పుతిన్, లుద్మిలాలు గతంలో విడాకులు తీసుకున్నారన్న విషయాన్ని మాత్రం అక్కడి అధికారులు స్పష్టం చేశారు. సుమారు 30 ఏళ్ల పాటు కలిసి జీవించిన పుతిన్, అతని మాజీ భార్య లుద్మిలా 2013 జూలైలో విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తర్వాత లుద్మిలా చాలా సాదాసీదాగా జీవితం గడిపారు.
రష్యా దేశ అధ్యక్ష అధికారిక నివాసమైన క్రెమ్లిన్ పుతిన్ జీవిత రహస్యాలపై గట్టి నిఘా పెడుతుంది. పుతిన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉంటే ఆ వివరాలు సైతం ఆ దేశ ప్రజలకు తెలియదు. అయితే ఒక కుమార్తె మాత్రం రాక్ అండ్ రోల్ డాన్సర్ ఏక్తరినా తికోనోవా అయి ఉంటుందని ఇటీవలే ఓ వార్తాకథనం వెల్లడించింది.
ఇది ఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మధ్య ఓ జిమ్నాస్ట్‌తో సంబంధం పెట్టుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అలినా కబేవాతో పుతిన్ శృంగార లీలలు కొనసాగుతున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆ అథ్లెట్‌కు పిల్లలు కూడా పుట్టారని వస్తున్న వార్తలను క్రెమ్లిన్ ఖండించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications