Rajapaksa: కరుణించిన సింగపూర్, సింహంలా బతికిన శ్రీలంక మాజీ అధ్యక్షుడికి సినిమా కష్టాలు !
సింగపూర్/శ్రీలంక: దర్జాగా సింహంలా ఇంతకాలం బతికిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఇప్పుడు నివాసం ఉండటానికి ఆశ్రయం లేకుండా టెన్షన్ గా బతుకుతున్నారు. శ్రీలంకలో ఎదురైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ దేశ ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడ్డాడు. ప్రజలు రెచ్చిపోవడంతో శ్రీలంక అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎస్కేప్ అయ్యాడు.
కొన్ని రోజులు శ్రీలంక మిలటరి స్థావరంలో తలదాచుకున్న గొటబయ రాజపక్స తరువాత ఆయన భార్యతో కలిసి మాల్దీవులకు పారిపోయాడు. మాల్దీవుల్లో శ్రీలంక జాతీయులు నిరసన వ్యక్తం చెయ్యడంతో అక్కడ గొటబయ రాజపక్సేకి ఎదురు దెబ్బ తిగిలింది. మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో గొటబయ రాజపక్స ఆయన భార్యతో కలిసి సింగపూర్ పారిపోయారు.

శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబయ రాజపక్సే అప్పటి నుంచి సింగపూర్ లో విజిటర్ వీసాతో కాలం గడుపుతున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే విజిటర్ వీసా గడువు పూర్తి అయ్యింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ఆయన భార్య మరో 14 రోజులు సింగపూర్ లో ఉండటానికి అక్కడ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజిటర్ వీసాతో ఆగస్టు 11వ తేదీ వరకు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ఆయన భార్య సింగపూర్ లో ఉండటానికి సింగపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఆగస్టు 11వ తేదీ తరువాత గొటబయ రాజపక్సే, ఆయన భార్య విజిటర్ విసా మీద సింగపూర్ లో ఉండటానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ?, లేదా ? అనే విషయం మాత్రం వేచిచూడాలి.












Click it and Unblock the Notifications