కుప్పకూలిని హెలికాప్టర్: నలుగురి మృతి
బ్రటిస్లావా: బాలుడికి చికిత్స చెయ్యడానికి వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోయిన సంఘటన సోవేకియా లో జరిగింది. హెలికాప్టర్ లో ఉన్న నలుగురు మరణించారని పోలీసు అధికారులు వెల్లడించారు.
శుక్రవారం తూర్పు స్లోవేకియా నుండి రెస్క్యూ హెలికాప్టర్ లో నలుగురు బయలుదేరారు. మార్గం మధ్యలో హర్బు సికా ప్రాంతంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు హెలికాప్టర్ కు తగిలాయి. అంతే హెలికాప్టర్ హర్నాడ్ నదిలో కూప్ప కూలిపోయింది.

హెలికాప్టర్ పైలెట్, ఒక వైద్యుడు, ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మరణించారు. విషయం తెలుసుకున్న రక్షణ శాఖ అధికారులు, రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. నలుగురు వ్యక్తులు మరణించారని స్లోవేకియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. 10 సంవత్సరాల బాలుడి తలకు బలమైన గాయాలు కావడంతో అత్యవసర వైద్యం అందించడానికి హెలికాప్టర్ లో వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications