డొనాల్డ్ ట్రంప్ డైట్ సీక్రెట్స్.. మరీ ఇంతా..!!

అమెరికా ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహారపు అలవాట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ డైట్ సీక్రెట్స్ ను ఆయన వెల్లడించారు. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోన్నప్పటికీ.. ప్రయాణాల్లో మాత్రం ఫాస్ట్ ఫుడ్‌పై ఆధారపడతారని తెలిపారు. వయస్సు, ఎనర్జీ, ఆహారంపై విమర్శలు వస్తున్న తరుణంలో రాబర్ట్ కెన్నెడీ చేసిన ఈ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కేటీ మిల్లర్ కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ట్రంప్ రోజువారీ ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు. ట్రంప్ వైట్‌హౌస్, మార్-ఎ-లాగోలలో ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకుంటారని, ప్రయాణాల్లో ఇందుకు పూర్తి భిన్నమైన పద్ధతి పాటిస్తారని అన్నారు. అమెరికాలో ఏవైనా స్టేట్స్ ను సందర్శించేటప్పుడు లేదా విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు పూర్తిగా ఫాస్ట్ ఫుడ్‌ పైనే ఆధారపడతారని స్పష్టం చేశారు. ప్రయాణ సమయాల్లో మెక్‌డొనాల్డ్స్ వంటి పెద్ద బ్రాండ్ల ఫాస్ట్ ఫుడ్ ఆహారాన్ని తీసుకుంటారని అన్నారు.

RFK Jr Shocks Everyone with Bold Remarks on Trump s Diet I Don t Know How He s Alive

డొనాల్డ్ ట్రంప్ తన శరీరంలో విషాన్ని నింపుకుంటున్నారని ఆయనతో కలిసి ప్రయాణించేవారు భావిస్తారని కెన్నెడీ నవ్వుతూ చెప్పారు. ఆహార నియమాలేవీ కూడా ట్రంప్ పెద్దగా పాటించరని, అయినప్పటికీ ఆయన ఆరోగ్యపరంగా పూర్తి ఫిట్ నెస్ తో ఉంటారని రాబర్ట్ కెన్నెడీ చెప్పారు. ఆయన శరీరాన్ని దేవుడి విగ్రహాలతో పోల్చారు. Constitution of a deity.. అని వ్యాఖ్యానించారు. "ఈ ఫుడ్ తింటూ ట్రంప్ ఎలా బతికి ఉన్నారో నాకు తెలియదు.." అని పేర్కొన్నారు. ః

డొనాల్డ్ ట్రంప్ చాలా శక్తిమంతంగా కనిపిస్తారని, ఇప్పటివరకు తాను కలిసిన వారందరిలోకి ఆయనే అత్యంత పవర్ ఫుల్ అని ప్రశంసించారు. ఫాస్ట్ ఫుడ్ అయినా, ఇంకే ఆహారం అయినా ట్రంప్ దాన్ని ఆస్వాదిస్తారని కెన్నెడీ అన్నారు. ప్రయాణ సమయాల్లో కూడా ట్రంప్ పెద్దగా విశ్రాంతి తీసుకుంటారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ఎక్కడికి ప్రయాణిస్తోన్నా అక్కడి విషయాల గురించి పూర్తి అవగాహనను తెచ్చకుంటారని, ప్రపంచ విషయాలపై ఆయనకు గట్టిపట్టు ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వయస్సు 79 సంవత్సరాలు. ఆయన పదవీకాలం ముగిసేనాటికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఈ వయస్సులో అమెరికా అధ్యక్షుడిగా పని చేయడం ఓ రికార్డు. ఇప్పటివరకు ఎవరూ దీన్ని చేరుకోలేదు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ట్రంప్ కూడా వృద్ధాప్య లక్షణాలపై విమర్శలను ఎదుర్కొన్నారు. సమావేశాల్లో నిద్రపోతున్నారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. వీటిని ఆయన తోసిపుచ్చారు. కన్నురెప్పలు ఆర్పేటప్పుడు ఫోటో తీస్తారని, సరిగ్గా రెప్ప పడ్డప్పుడు పట్టుకుని ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+