బ్రిటన్ ప్రధాని పీఠం రేసులో రిషి సునక్ ముందంజ... నాలుగో రౌండ్‌లో విక్టరీ

బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు వేస్తున్నారు. నాలుగో రౌండ్‌లో కూడా ఆయనే విజయం సాధించారు. బ్రిటన్ ప్రధాని పదవీకి జరుగుతున్న పోరులో ముందంజ వేశారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవీకి ప్పటివరకు నాలుగు రౌండ్ల పోరు జరగ్గా, ప్రతి రౌండ్ లోనూ రిషి స్పష్టమైన అధిక్యం సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైన వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు.

Recommended Video

    బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు *International | Telugu OneIndia
    రిషి ముందంజ

    రిషి ముందంజ

    రిషి సునాక్ తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంటున్నారు. కేవలం 59 ఓట్లు సాధించిన కెమి బడెనోవిచ్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రధాని పదవి కోసం బరిలో ముగ్గురే మిగిలారు. ఆ ముగ్గురిలో రిషి సునాక్ అగ్రస్థానంలో ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్టాంట్, విదేశాంగ మంత్రి లిజ్ ట్రూజ్ మిగిలిన ఇద్దరు. తాజా రౌండ్ ఓటింగ్ లో రిషి సునాక్ 118 ఓట్లు రాబట్టగా, రెండో స్థానంలో ఉన్న పెన్నీ మోర్టాంట్ 92 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న లిజ్ ట్రూజ్ 86 ఓట్లు దక్కించుకున్నారు. 'రెడీ ఫర్ రిషి' అంటూ రిషి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి మరీ తన ఆలోచనలను పంచుకుంటున్నారు.

     ఇదీ నేపథ్యం..

    ఇదీ నేపథ్యం..

    రిషి సునక్ తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టిషనర్, తల్లి ఫార్మాసిస్ట్. రిషి సునక్ ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ వర్సిటీల్లో డిగ్రీ పూర్తిచేశారు. నారాయణ మూర్తి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2015లోనే అతను ఎంపీగా ఎన్నికయ్యాడు. రిచ్ మండ్, యార్క్ షైర్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. 2020లో జీవితంలో మైలురాయిగా నిలిచింది. బ్రిటన్ క్యాబినెట్‌లో కీలకమైన ఆర్థికమంత్రి పదవీ చేపట్టారు.

    అయినా.. ఓకే

    అయినా.. ఓకే

    రిషి సునక్‌కు ఒక్క అంశం ప్రతికూలత కనిపిస్తోంది. ఇటీవల ఆయన భార్య అక్షత మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఆమె భారత్‌కు చెందిన మహిళ కావడంతో ఆమె నాన్ డొమిసైల్ హోదాలో బ్రిటన్‌లో ఉంటున్నారు. భారత పౌరసత్వం మాత్రమే ఉండడంతో బ్రిటన్‌లో నాన్ డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. నాన్ డొమిసైల్ హోదా ఉన్న వారు విదేశీ గడ్డపై సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అక్షత మూర్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని బ్రిటన్ విపక్షాలు ఆరోపించాయి. అక్షతపై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని రిషి సునక్ వర్గం ఎదురుదాడికి దిగింది. కానీ ఇదీ అంతగా ప్రభావం చూపించలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+