1BHK గదికి రూ. లక్షల్లో రెంట్: డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయేంట్రా
లండన్‌లో నివసించే భారతీయ యువతి దీపాంశి చౌదరి షేర్ చేసిన ఓ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది. సెంట్రల్ లండన్‌లో ఉన్న ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్ 1BHK నెలవారీ అద్దెకు సంబంధించిన వీడియో అది. ప్రతి నెలా ఎనిమిది లక్షల రూపాయల అద్దె ఉందని దీపాంశి తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ అద్దె మొత్తం.. సోషల్ మీడియా యూజర్లను విస్మయానికి గురి చేసింది. దీనిపై డిబేట్ నడుస్తోంది.
అపార్ట్‌మెంట్ లోపల ఓ చిన్న లాబీ, కుడివైపు వాష్‌రూమ్, కాంపాక్ట్ స్టోరేజ్ రూమ్ ఉన్నట్లు వీడియోలో చూపించారు. బెడ్‌రూమ్‌లో క్వీన్ సైజ్ బెడ్, కబోర్డ్ ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌లో సోఫా, డైనింగ్ టేబుల్, టెలివిజన్‌తో కూడిన లివింగ్ రూమ్, ఓ వంటగదిని రికార్డ్ చేశారు. ఈ గదికి లండన్‌లో నెలకు ఎనిమిది లక్షల రూపాయల అద్దె.. అని వీడియోలో టెక్స్ట్ ఓవర్ లే అవుట్ కనిపించిందీ వీడియోపై. ఈ అపార్ట్‌మెంట్ సెంట్రల్ లండన్‌లో ఉందని, సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు ఎదురుగా కనిపిస్తుందని దీపాంశి క్యాప్షన్‌లో వివరించారు.

క్రిస్మస్ పండుగ సమయంలో 30 రోజుల స్వల్పకాలిక బస కోసం అపార్ట్‌మెంట్ బుక్ చేసినందుకు ఈ అద్దె మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని, ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల అద్దె అధికంగా ఉన్నట్లుగా భావిస్తోన్నానని ఆమె పేర్కొన్నారు. పైగా సెయింట్ పాల్స్ కేథడ్రల్ కు సమీపంలో ఉండటం వల్ల కూడా అద్దె మొత్తం లక్షల రూపాయల్లో వసూలు చేయడానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అద్దె చాలా ఎక్కువేనని, దానికి తగ్గట్టుగా ఈ బెడ్ రూమ్ ఫ్లాట్ లేదని అన్నారు.
ఈ అద్దె మొత్తం సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అద్దె మొత్తం ఏ మాత్రం ఊహించని విధంగా ఉందని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. మరొకరు- హాంప్‌స్టెడ్ వంటి ప్రాంతాల్లో రెండు అంతస్తుల ఇళ్ళు కూడా నెలకు 2,000 నుంచి 3,000 పౌండ్లకు లభిస్తాయని తెలిపాడు. ఒక్క పౌండ్ విలువ భారతీయ కరెన్సీలో 121 రూపాయలు పైమాటే. కెనరీ వార్ఫ్‌లో నివసిస్తున్నానని బిల్లులతో సహా త్రీ బెడ్‌రూమ్ (3BHK) ఫ్లాట్‌కు నెలకు 3,200 పౌండ్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications