రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త ట్విస్ట్!
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 2022, ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం 42 నెలలు దాటినా ఆగడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రష్యా దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌కు ప్రతిరోజు భారీ నష్టం జరుగుతోంది. అయితే రష్యా సైనికులు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా సైన్యం నెమ్మదిగా ఉక్రెయిన్‌లోని నగరాలు, గ్రామాల్లో ప్రవేశిస్తోంది.
డ్నిప్రోపెట్రోవ్స్క్‌లోకి రష్యా సైన్యం
ఉక్రెయిన్ సైన్యం ప్రతినిధి ఒకరు రష్యా సైన్యం డ్నిప్రోపెట్రోవ్క్క్(Dnipropetrovsk) నగరంలోకి ప్రవేశించందని అంగీకరించారు. రష్యాసైన్యం ఈ నగరంలోకి ప్రవేశించినట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించడం ఇదే మొదటిసారి. డ్నిప్రోపెట్రోవ్స్క్ ఉక్రెయిన్‌లో నాలుగో అతిపెద్ద నగరం, ఇది ఒక ప్రధాన కేంద్ర పరిపాలనా ప్రాంతం కూడా. ఇంతకు ముందు డ్నిప్రోపెట్రోవ్స్క్ ఈ యుద్ధానికి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ నగరంలోక కూడా రష్యా సైన్యం చొరబడింది. ఇది ఉక్రెయిన్ దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

రష్యా ప్రణాళిక ఏమిటి?
రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో ముందుకు సాగుతున్న తీరును బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రష్యా నెమ్మదిగా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు, గ్రామాల్లోకి చొరబడి ఉక్రెయిన్‌ను బలహీనపరచాలని యోచిస్తోంది.
ట్రంప్ విదేశాంగ విధానం మరోసారి విఫలం
రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని డ్నిప్రోపెట్రోవ్క్క్ నగరంలోకి ప్రవేశించిడం ట్రంప్ విదేశాంగ విధానంలో మరో వైఫల్యం. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి తాను ప్రయత్నిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ నిరంతరం వాదిస్తున్నారు. ఇందుకోసం ట్రంప్ చర్చలు,సమావేశాలు, బెదిరింపులు,సుంకాలు, ఆంక్షలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విదేశాంగ విధానం మరోసారి విఫలమైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications