భీకరదాడులు: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 65 కి.మీల మేర విస్తరించిన రష్యా భారీ ఆయుధ కాన్వాయ్

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యా బలగాలు మరింత రెచ్చిపోతున్నాయి. భీకరమైన దాడులకు పాల్పడుతున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో నాటోలో చేరవద్దని, నాటోలో చేరమని లిఖితపూర్వక పత్రం ఇవ్వాలని ఉక్రెయిన్‌ను రష్యా డిమాండ్ చేసింది. అయితే, ముందుగా రష్యా తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, కాల్పులను విరమించాలని ఉక్రెయిన్ పట్టుబట్టింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.

ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దళాలు

మరోసారి చర్చలు జరిపేందుకు ఇరుపక్షాల నేతలు అంగీకరించారు. అయితే, ఈ క్రమంలోనే రష్యా దళాలు దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాపై యూఎన్, నాటో, సహా పలు దేశాలు ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నప్పటికీ.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా, ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై దాడికి పాల్పడింది. నివాసాల ప్రాంతాలపైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో రష్యాకు ప్రవేశాన్ని నిషేధిస్తూ అన్నిదారుల్ని(నౌకాశ్రయాలు, కాలువలు, విమానాశ్రయాలు) మూసివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్సీ ప్రపంచ దేశాలను కోరారు.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలో భారీ రష్యా ఆయుధ కాన్వాయ్

అయితే, ఇవేమీ లెక్కచేయకుండా రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని వైపు కదులుతున్నాయి. కీవ్ వైపు భారీ స్థాయిలో ఆయుధాలతో రష్యా సేనలు కదులుతున్న చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటి చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ సేకరించింది. కీవ్ నగరానిిక ఉత్తరాన 40 మైళ్లు (సుమారు 65 కిలోమీటర్లు)మేర రష్యా కాన్వాయ్ విస్తరించింది. మొదట అది 17 మైళ్లే అని నివేదిక వచ్చినా.. అంతకు రెట్టింపు స్థాయిలోనే బలగాలు కదులుతున్నాయని తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

Recommended Video

    Russia Ukraine Conflict: EU Membership .. ఉక్రెయిన్ రష్యాను మరింత రెచ్చగొడుతోందా? | OneindiaTelugu

    రాజధాని, ప్రధాన నగరాలే లక్ష్యంగా రష్యా బలగాల దాడులు

    ఆంటోనోవ్ విమానాశ్రయం నుంచి ప్రిబిర్క్స్ పట్టణం మధ్యలో ఉన్న రహదారిపై మొత్తం రష్యా సైనిక వాహనాలు, ట్యాంకులు, ఫిరంగి దళాలతో నిండిపోయినట్లు ఈ చిత్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ రహదారికి సమీపంలో ఉన్న భవనాలు కాలిపోతున్నట్లుగా చిత్రాల్లో కనిపిస్తోంది. అంటే, రష్యా బలగాలు దాడుల్లో ఈ భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

    రాజధాని సహా ప్రధాన నగరాలను చేజిక్కించుకోవాలని రష్యా బలగాలు ముమ్మరంగా దాడులు చేస్తుండగా.. అదే స్థాయిలో ఉక్రెయిన్ దళాలు కూడా ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రజలు కూడా ఆయుధాలు చేపట్టి రష్యా బలగాలపై దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 14 మంది చిన్నారులతోపాటు 350కిపైగా ప్రజలు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు హతమయ్యారని, వందలాది మందిని బంధించామని వెల్లడించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+