Russia Ukraine War: థియేటర్ ను బాంబులతో పేల్చేసిన రష్యా, వెయ్యి మంది ఆశ్రయం, టైమ్ !
ఉక్రెయిన్/కీవ్: ఉక్రెయిన్ ఉసురు తీస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ అతని రాక్షసత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయని ఉక్రెయిన్ అధికారులు మండిపడుతున్నారు. ఇప్పటికే మా దేశాన్ని సర్వనాశనం చేసిన రష్యా ఇప్పుడు అమాయకులు, మహిళలు. చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని ఉక్రెయిన్ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రష్యా సైనికుల అరాచకాలకు భయపడి ఇప్పటికే 30 లక్షల మందికి పైగా సామాన్య ప్రజలు ఉక్రెయిన్ వదిలి పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఉక్రెయిన్ లోని అనేక నగరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాల్పుల విరమణ అంటూనే రష్యా సైనికులు ఉక్రెయిన్ లోని అనేక నగరాల్లో దాడులు చేస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ లోని మారియోపోల్ లోని ఓ థియేటర్ లో వేలాది మంది సామాన్య ప్రజలు తలదాచుకున్నారు. సామాన్య ప్రజలు తలదాచుకున్న థియేటర్ మీద బాంబులు వేసిన రష్యా సైనికులు దానిని పేల్చి వేశారని, అమాయకులైన ప్రజలు గాలిలో కలిసిపోయాయని, చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఒక థియేటర్ మీద బాంబుల వర్షం కురిపించి అమాయకులను చంపిన రష్యా మీద కచ్చితంగా పగ తీర్చుకుంటామని మారియోపోల్ మేయర్ రష్యా సైనికులను హెచ్చరించారు.

రష్యా అధ్యక్షుడు రాక్షసుడు
ఉక్రెయిన్ ఉసురు తీస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ అతని రాక్షసత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయని ఉక్రెయిన్ అధికారులు మండిపడుతున్నారు. ఇప్పటికే మా దేశాన్ని సర్వనాశనం చేసిన రష్యా ఇప్పుడు అమాయకులు, మహిళలు. చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని ఉక్రెయిన్ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అమాయకులను వెంటాడుతున్న రష్యా సైనికులు
రష్యా సైనికుల అరాచకాలకు భయపడి ఇప్పటికే 30 లక్షల మందికి పైగా సామాన్య ప్రజలు ఉక్రెయిన్ వదిలి పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఉక్రెయిన్ లోని అనేక నగరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాల్పుల విరమణ అంటూనే రష్యా సైనికులు ఉక్రెయిన్ లోని అనేక నగరాల్లో దాడులు చేస్తూనే ఉన్నారు.

థియేటర్ మీద బాంబులతో దాడి చేసిన రష్యా !
ఉక్రెయిన్ లోని మారియోపోల్ లోని ఓ థియేటర్ లో వేలాది మంది సామాన్య ప్రజలు తలదాచుకున్నారు. సామాన్య ప్రజలు తలదాచుకున్న థియేటర్ మీద బాంబులు వేసిన రష్యా సైనికులు దానిని పేల్చి వేశారని, అమాయకులైన ప్రజలు గాలిలో కలిసిపోయాయని, చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

థియేటర్ ను పేల్చేశారు...... ప్రతీకారం తీర్చుకుంటాము
ఒక థియేటర్ మీద బాంబుల వర్షం కురిపించి అమాయకులను చంపిన రష్యా మీద కచ్చితంగా పగ తీర్చుకుంటామని మారియోపోల్ మేయర్ రష్యా సైనికులను హెచ్చరించారు. మారియోపోల్ లోని థియేటర్ (రంగస్థలం)లో వేలాది మంది అమాయకులు ఆశ్రయం పొందుతున్నారని, మారియోపోల్ మేయర్, కౌన్సిల్ సభ్యులు అక్కడ తలదాచుకున్న ప్రజలకు ఆహారం, నీరు అందిస్తున్నారని అధికారులు అంటున్నారు. థియేటర్ మీద రష్యా బాంబుల దాడి చెయ్యడంతో ఎంత మంది చనిపోయారు అని కచ్చితంగా తెలీయడం లేదని, చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని మారియోపోల్ మేయర్ అంటున్నారు.
Recommended Video


ఆసుపత్రులు, అపార్ట్ మెంట్ల మీద రష్యా దాడులు
ఇప్పటికే మారియోపోల్ లోని ఆసుపత్రుల మీద, సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ల మీద బాంబు దాడులు చేసిన రష్యా ఇప్పుడు సామాన్య ప్రజలు తలదాచుకున్న థియేటర్ మీద దాడులు చెయ్యడంతో ఉక్రెయిన్ అధికారులు, ఆ దేశంలోని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications