Russia Ukraine war:పుతిన్ చర్యలను ఖండించిన బైడెన్: రెచ్చగొడుతున్నారు... మీ సంగతి కూడా తేలుస్తామన్న రష్యా
రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలైంది. గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. దీంతో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలోనే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా కూడా రష్యాను తీవ్రంగా హెచ్చరించింది. ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా చర్యలను తప్పుబట్టారు. రష్యా యుద్ధాన్ని ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. ఈ చర్య సరైనది కాదని రెచ్చగొట్టేలా రష్యా వ్యవహరిస్తోందని జో బైడెన్ మండిపడ్డారు.
Recommended Video
అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటిస్తూ మిలటరీ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఒత్తిళ్లు వస్తున్నా ఏమాత్రం జంకని పుతిన్ యుద్ధమే శరణ్యంగా భావించి ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడ క్షిపణులతో దాడులను ప్రారంభించింది రష్యా సైన్యం. ఇక ఉక్రెయిన్‌లో నివసిస్తున్న పలు దేశాల ప్రజలకు ఆయా దేశ ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు జారీ చేశాయి. ఇప్పటికే భారత్ పలు విమానాలను ఉక్రెయిన్‌కు పంపి అక్కడ ఉన్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంది. ఇంకా ఇది పూర్తి కాకముందే ఉక్రెయిన్-రష్యా దేశాలపై యుద్ధ మేఘాలు అలుముకోవడంతో భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

ఇక గురువారం ఉదయం పుతిన్ ఓ టీవీ ఛానెల్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు బయటి దేశాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే వారి భరతం కూడా పడతామంటూ గట్టి హెచ్చరికలే జారీ చేశాడు. ఉక్రెయిన్ మిలటరీ తమ ఆయుధాలను వీడి రష్యాకు లొంగిపోవాలంటూ హుకూం జారీ చేశారు. కివ్‌కు వ్యతిరేకంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న రెబల్ నాయకులు తమకు అండగా నిలవాలంటూ పుతిన్‌ను కోరడంతో ఆయన యుద్ధం ప్రకటించారు.












Click it and Unblock the Notifications