రాజమౌళిని మించిన క్లైమాక్స్.. 728 డ్రోన్ లు, 13 మిసైల్స్ తో మారణహోమం

రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం క్లైమాక్స్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. వందలకొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ అట్టుడికి పోతోంది. తాజాగా మరోసారి ఉక్రెయిన్ పై 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో మారణహోమం సృష్టించింది రష్యా. గత మూడేళ్లలో ఇదే అతి పెద్ద దాడి. 8 రోజుల వ్యవధిలోనే మూడు భారీ ఎటాక్స్ చేసింది. అవి ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి.

ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. గత మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం ఒకెత్తు అయితే 8 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే యుద్ధం క్లైమాక్స్ కు వచ్చినట్లు తెలుస్తోంది. గత 8 రోజులుగా దాడులను ఉద్ధృతం చేసింది రష్యా. వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో మారణహోమం సృష్టిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ పై 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో రష్యా దాడి చేసింది. ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి.

Russia Unleashes Chaos 723 Drones 13 Missiles Strike Ukraine in Massive Assault

ఉక్రెయిన్ పై దాడులపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు వారి ప్రజల్ని, దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందని అందువల్ల వారికి మద్ధతుగా మరిన్ని ఆయుధాలు పంపిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే రష్యా తగ్గేదేలే అన్నట్లుగా బిగ్గెస్ట్ ఎటాక్ చేసింది.

అయితే ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. రష్యా- ఉక్రెయిన్ మధ్యలో అమెరికా వస్తే.. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది. శాంతి చర్చలను కోరుకుంటున్న ట్రంప్.. ఆయుధాలు ఎలా పంపిస్తారని ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఎటువైపునకు దారి తీస్తుందోనని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+