దేశ రక్షణ కోసం ముందుకు వచ్చే వారందరికీ ఆయుధాలు ఇస్తాం: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పిలుపు
కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో ఉక్రెయిన్‌పై యుద్ధ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోంది. రష్యా యుద్ధ విమానాలపై దాడులు చేసి కూల్చేస్తోంది. రష్యా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తోంది.
Recommended Video
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్క్సీ ఈ సందర్భంగా తమ దేశ ప్రజలనుద్దేశించి కీలక పిలుపునిచ్చారు. దేశంలో కోసం పోరాడేందుకు సిద్ధంగా ఎవరున్నా.. వారికి ఆయుధాలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. దేశం కోసం పోరాడేవారందరికీ అవసరమైన ఆయుధాలను ఇస్తామన్నారు.

రష్యాతో ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలి వారాల్లో ప్రాథమిక సైనిక శిక్షణ పొందుతున్న ఉక్రేనియన్ పౌరుల చిత్రాలను మీరు చాలాసార్లు చూసినట్లు మీకు గుర్తుండే ఉండవచ్చు.
రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ భూభాగంపై దాడి చేసిన తరువాత ఉక్రెయిన్ అధికారికంగా రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మీడియా సమావేశంలో తెలిపారు.
ఉక్రేనియన్లు తమ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించడంతో అప్రమత్తమయ్యారు. రష్యా దాడులు చేస్తుండటంతో నిన్న రాత్రి నుంచే ప్రజలు ఏటీఎంలు, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఇక్కడ తూర్పు ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత, అనిశ్చితి, భయానక వాతావరణం ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు.
బుధవారం రాత్రి నుంచే పేలుళ్ల శబ్ధాలతో ఇక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. పెద్దలు, పిల్లలు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల శబ్ధాలకు పిల్లలు భయంతో విలపిస్తున్నారు. దాడుల భయంతో తాము తమ పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నామని ఉక్రెయిన్ ప్రజలు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు ఇప్పటికే చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications