వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల దాడులు..? రష్యా కీలక ప్రకటన.. టైం చెప్పిన క్రెమ్లిన్.. !!

|
Google Oneindia TeluguNews

రష్యా బాంబుల దాడులకు ఉక్రెయిన్ వణికిపోతోంది. రాజధాని కీవ్‌తో పాటు, మరియుపోల్, ఖార్కివ్ వంటి ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునేందుకు క్షిపణులతో విరుచుకుపడుతోంది. నగరాల్లోని భవనాలు, రోడ్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. శవాల దిబ్బలుగా మారాయి. బాంబుల వర్షానికి సుందర తీర నగరమైన మరియుపోల్ మాడిమాసైపోయింది. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయేందుకు నిరాకరించడంతో రష్యా దళాలు తమ దాడుల్ని మరింత తీవ్రతరం చేశాయి. నగరాన్ని శ్మశనంలా మార్చారంటూ ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 తమ దేశ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే..

తమ దేశ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే..

ఉక్రెయిన్‌పై దాడులు భీకర దాడులు కొనసాగుతున్న తరుణంలో.. రష్యా అణ్వాయుధాల ప్రకటన ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఫిబ్రవరి24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్చ చేపట్టింది. దానికి నాలుగు రోజుల తర్వాత ప్రపంచ దేశాల‌ను ఆందోళన గురిచేసేలా అణ్వాయుధాలపై ప్రకటన చేసింది. తమ వ్యూహాత్మక అణ్వాయుధాల బలగాలను కూడా అప్రమత్తం చేసినట్లు పేర్కొంది. తాజాగా మరోసారి అణ్యాయుధాల ఉపయోగించడంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశ అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే వాటిని తాము వాడతామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. తమకు దేశీయ భద్రత అనే విధానం ఉంది. దానికి అనుగణంగా తమ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు..

 ర‌ష్యా తీరు అత్యంత ప్ర‌మాద‌క‌రం

ర‌ష్యా తీరు అత్యంత ప్ర‌మాద‌క‌రం

రష్యా అణ్వాయుధాల ప్రకటనపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దిమిత్రీ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలకు పెంటాగన్ ప్రతినిధి జాన్ కిర్బీ తీవ్రంగా స్పందించారు. రష్యా తీరు అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన‌ అణ్వాయుధ దేశం ప్రవర్తించే విధానం ఇది కాదని దుయ్యబట్టారు. ప్రస్తుతం మా వ్యూహాత్మక విధానంలో మార్పు లేదు. తాజా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం అని తెలిపారు. అటు రష్యా ప్రకటన తర్వాత అణ్వాయుధాల కదలిక సంకేతాలు లేవని పశ్చిమదేశాలు పేర్కొంటున్నాయి. ఇరుదేశాలు శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి.

 మ‌రియుపోల్ తీరంవైపు యుద్ధ‌నౌక‌లు

మ‌రియుపోల్ తీరంవైపు యుద్ధ‌నౌక‌లు

మరోవైపు మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దాడులను ముమ్మరం చేసింది. ఆ దిశగా మాస్కో సేనలు అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి. అజోవ్ సముద్రం నుంచి మరియుపోల్ తీర ప్రాంతానికి రష్యా యుద్ధ నౌకలు కదులుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు నల్ల సముద్రంలో మరో 21 యుద్ధ నౌకలను రష్యా సేనలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అటు రష్యాపై మరిన్ని ఆంక్షలను విదిస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది.

English summary
Russia's key statement on the use of fnuclear weapons against Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X