వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా టార్గెట్ అమెరికా యుద్ద విమానాలు - జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్​ క్షిపణి సక్సెస్..!!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పైన దాడులు కొనసాగిస్తున్న రష్యా తన ఆయుధ పాటవాన్ని మరోసారి ప్రదర్శించింది. ధ్వని వేగం కన్నా 9 రెట్లు (గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని తాజాగా పరీక్షించింది. బాలిస్టిక్‌ తరగతికి చెందని క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైంది. ఈ తరహా పరిజ్ఞానంలో తన ఆధిపత్యాన్ని మరోసారి రష్యా చాటింది. జిర్కాన్‌ హైపర్‌సానిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అగ్రరాజ్యానికి ఒనగూరిన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు రష్యా హైపర్‌సోనిక్‌ అస్త్రాలవైపు మొగ్గింది. బారెంట్స్‌ సముద్రంలోని అడ్మిరల్‌ గోర్షోవ్‌ ఫ్రిగేట్‌ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌ వెయ్యి కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా రష్యా చిన్న పట్టణాలను తన అధీనంలోకి తీసుకుంటున్నది. దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. జిర్కాన్‌ క్షిపణిని శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవని రష్యా సైనికాధికారులు చెబుతున్నారు.

Russian forces Saturday announced a latest successful test of their Zircon hypersonic cruise missile

దీనికి ఆ అస్త్ర వేగం ఒక కారణమైతే.. అందులో ప్రత్యేకంగా అమర్చిన స్టెల్త్‌ పరిజ్ఞానం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ క్షిపణిలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఇందులో వినియోగించిన అప్‌గ్రేడెడ్‌ ఇంధనంవల్లే అది మెరుపులా దూసుకెళ్లగలుగుతోంది. ఈ వేగం కారణంగా జిర్కాన్‌ ముందు భాగంలోని వాయుపీడనం.. క్షిపణి చుట్టూ ప్లాస్మా మేఘాన్ని ఏర్పరుస్తుంది. ఫలితంగా ఆ క్షిపణి ప్రత్యర్థి నిఘా నేత్రానికి చిక్కదు. అందువల్ల దాన్ని మరో అస్త్రంతో నేలకూల్చడం కష్టమే.అమెరికాకు చెందిన ఏజిస్‌ క్షిపణి రక్షణ వ్యవస్థకు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం అవుతుందని అంచనా. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్‌ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంతో..ఏజిస్‌ క్షిపణికి అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు.

English summary
Russia's navy has conducted another successful test of a prospective hypersonic missile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X