వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబీరియాలో కుప్పకూలిన హెలికాప్టర్: 18మంది మృతి

|
Google Oneindia TeluguNews

సైబీరియా: రష్యాకు చెందిన హెలికాప్టర్‌ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐ-8 హెలికాప్టర్‌ శనివారం ఉదయం ఆయిల్‌ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

హెలికాప్టర్‌లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మరో హెలికాప్టర్‌ మోసుకొస్తున్న పరికరాలకు తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. మరో హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు చెప్పారు.

Russian helicopter crash kills 18 in Siberia

ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయన్నారు. రష్యాలోని ఇగర్కా అనే నగరం నుంచి హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యింది.

విమానాశ్రయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగి కూలిపోయింది. సాంకేతిక సమస్యతో పాటు పైలట్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని, హెలికాప్టర్‌లో నిండుగా ఉన్న రెండు ఇంధన ట్యాంకులు పేలిపోయాయని రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి.

English summary
Eighteen people have died in a Russian helicopter crash in north-western Siberia, officials say. Russia's emergencies ministry said the MI-8 went down at 10:20 local time (03:20 GMT), about 180km (112 miles) from the town of Igarka, in Krasnoyarsk Territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X