మంటలు చెలరేగడంతో కుప్పకూలిన మిలటరీ విమానం: 15 మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలింది. ఈ ఘటనలో విమానంలోని 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఇల్-76 మిలిటరీ కార్గో విమానం మంగళవారం పశ్చిమ రష్యాలోని ఎయిర్ బేస్ నుంచి 15 మందితో టేకాఫ్ అయ్యిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే, కొద్ది సేపటికే విమానంలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్ల ఇవానోవో ప్రాంతంలో కూలినట్టు తెలిపింది. కాగా, ప్రమాద సమయంలో అందులో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్టు పేర్కొంది. విమానంలో ఉన్న వారి పరిస్థితి గురించి అధికారులు చెప్పనప్పటికీ.. వారెవరూ సురక్షితంగా లేరని రష్యా మీడియా పేర్కొంది.

ప్రమాద ఘటన జరిగిన సమయంలో విమానంలో మంటలు చెలరేగి ఓ వైపు ఒరిగి కిందకు పడిపోతున్నట్టు కనిపించింది. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున పొగలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: A Russian military carco plane crashed near the city of Ivanovo northeast of Moscow, Russia 🇷🇺
— DISASTER TRACKER (@DisasterTrackHQ) March 12, 2024
| 12 March 2024 |#planecrash #Russia #Ukraine #Russian #RussianArmy pic.twitter.com/Mmtvgyjdfo












Click it and Unblock the Notifications