సిరియాలో కూలిన రష్యా విమానం, 32 మంది మృతి
సిరియా: రష్యాకు చెందిన మిలటరీ విమానం సిరియాలో మంగళవారం కూలిపోయింది.ఈ ఘటనలో 32 మంది ప్రయాణీకులు మరణించారు. ఈ విమానంలో 26 మంది ప్రయాణీకులున్నారు. మరో ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
సిరియన్ కోస్టల్ ప్రాంతంలోని లతాకియా సిటీ వద్ద రష్యా రక్షణ శాఖ విమానం కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే కూలిపోయిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

సంఘటన స్థలంలో అధికారులు సహయక చర్యలను చేపట్టారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా సాంకేతిక లోపం కారణంగా అధికారులు చెబుతున్నారు. అయితే ఏ రకమైన కారణాలు దీనికి దారితీశాయనే దానిపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications