ఉక్రెయిన్ పైన మిలిటరీ ఆపరేషన్ - రష్యా అధ్యక్షుడి ప్రకటన : బలగాలతో సిద్దం..!!

ఊహించిందే జరిగింది. ఉక్రెయిన్ పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ మొదలైందని ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రకటించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆ దేశం చుట్టూ సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. డోన్బాస్ లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కు వెళ్లాలని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సైతం తమ బలగాలతో సిద్దం అయింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తన దేశం రష్యాకు ముప్పు కలిగిస్తోందన్న మాస్కో వాదనలను ఉక్రేనియన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ మీదకు సైనిక బలగాలను ఉప సంహరించుకోవాలని ఐక్య రాజ్యసమితి రష్యాకు సూచించింది.

Recommended Video

    Russia-Ukraine News: Russia-Ukraine crisis Updates
    యూఎన్ఓ హెచ్చరించినా

    యూఎన్ఓ హెచ్చరించినా


    అదే సమయంలో యూరోపియన్ దేశాలు సైతం రష్యా పైన ఆంక్షలను ప్రకటించాయి, తాజాగా రష్యాలోని అధికారులు, చట్టసభ్యులు, పలు సంస్థలపై ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సభ్య దేశాలు చర్చలు జరిపాలని.. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరింది. ఈ మేరకు రష్యా చర్యలను ఆందోళనకరమైనవిగా ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అభివర్ణించారు.

    ముందుకే వెళ్లాలని పుతిన్ నిర్ణయం

    ముందుకే వెళ్లాలని పుతిన్ నిర్ణయం

    ఉక్రెయిన్​లో అత్యవసర పరిస్థితి విధించేందుకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి అమల్లోకి రానుంది. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్​ను ఎదుర్కొనేందుకు సైనిక బలగాల సాయం కావాలని ఉక్రెయిన్​లోని వేర్పాటువాదులు తమను కోరినట్లు రష్యా తెలిపింది. ఈ మేరకు వేర్పాటువాదులు రష్యా అధ్యక్షుడు పుతిన్​కు లేఖ రాసినట్లు రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్​కోవ్ తెలిపారు.

    ఏయిర్ స్పేస్ మూసేసిన ఉక్రెయిన్

    ఏయిర్ స్పేస్ మూసేసిన ఉక్రెయిన్

    ఉక్రెయిన్​ మిలిటరీ దాడుల కారణంగా డాన్​బాస్ ప్రాంతంలోని పౌరులు మరణిస్తున్నారని, చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని లేఖలో పేర్కొన్నట్లు వివరించారు. ఉక్రెయిన్ తమ ఏయిర్ స్పేస్ ను మూసేసింది. ఇక, ఇప్పుడు పుతిన్ నిర్ణయం పైన యూరోపియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. పుతిన్ ఇప్పటికే మూడు మార్గాలను ఎంచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్ రెబల్స్ పుతిన్ సాయం కోరుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+