స్నేహితురాల్ని చంపేసి, ముక్కలు చేసి, పెనంపై కాల్చింది
మాస్కో: రష్యాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన స్నేహితురాలిని క్రూరంగా చంపేసి, ఆమె తలను నరికేసి, ఆ తర్వాత పెనం పైన అవయవాలను కాల్చివేసింది. ఆమె చేసిన ఘాతుకానికి సంబంధించిన అంశాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో లభ్యమయ్యాయి.
ఈ ఘోరం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగింది. వస్తున్న వార్తల మేరకు.. సంసోనోవా అనే మహిళ ఈ హత్య చేసింది. ఆమె తన స్నేహితురాలు వాలెంటినా ఉలనోవాను చంపేసింది. ఆ తర్వాత ఆమె తలను నరికింది.

అనంతరం దానిని పెద్ద పెనం పైన వేడి చేసింది. హత్యకు ముందు తన స్నేహితురాలికి నిద్ర మాత్రలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 50 వరకు నిద్రమాత్రలు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తినే ఆహారంలో ఈ మాత్రలను ఇచ్చింది. అనంతరం చంపేసింది.












Click it and Unblock the Notifications