ఐసిస్ అంతం: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో

సిరియా: తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను అంతం చేసిన రష్యా సైనికుడిని అక్కడి పత్రికలు 'రష్యా రాంబో'గా కీర్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ ప్రొకోరెన్కోవ్‌(25) రష్యన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌లో ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నాడు.

ఉగ్రవాదుల జాడను కనిపట్టే పనిలో భాగంగా వారం క్రితం సిరియాలోని ప్రాచీన నగరం పాల్మెయర్‌ వద్ద దాడి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి రష్యా యుద్ధ విమానాలకు సమాచారం అందించే బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో అలెగ్జాండర్‌ విధి నిర్వహణలో ఉండగా ఐసిస్ ఉగ్రవాదులు అతన్ని చుట్టుముట్టారు.

దీంతో అతడు ఐసీస్ ఉగ్రవాదులకు లొంగిపోయేందుకు అంగీకరించకుండా... తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అనుకున్నాడు. వెంటనే రష్యా అధికారులకు సమాచారం అందించి తాను ఉన్న ప్రదేశంపై బాంబులు జారవిడవాల్సిందిగా సూచించాడు. ఇందుకు తొలుత రష్యా వాయుసేన కాస్త సంకోసించినా ఉగ్రవాదులను తుద ముట్టించాలనే లక్ష్యంతో బాంబులను జారవిడిచాయి.

అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో

అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో


ఈ ఆపరేషన్‌లో అతడు మృతి చెందినట్లు రష్యా సైనిక వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ‘‘ రష్యా స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి వైమానిక దాడులను సమన్వయ పరుస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు '' అని పేర్కొంది.

అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో

అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో


ఇది ఇలా ఉంటే అలెగ్జాండర్‌కు ఇటీవలే ఎకటేరీనతో వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భవతి. అయితే ఆమెకు అలెగ్జాండర్ సిరియాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలియదు. అలెగ్జాండర్‌ సీక్రెట్ ట్రూప్స్‌లోనే పని చేస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు.

 అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో

అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో


స్కూల్‌లో చదువుకునే రోజుల్లో సిల్వర్ మెడల్‌ను పొందిన అలెగ్జాండర్ ఆ తర్వాత మిలిటరీ అకాడమీలో బంగారు పతకాన్ని పొందాడు. 18 నెలల క్రితం ఎకటరేనతో పెళ్లి సందర్భంగా ప్రపంచంలో తాను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా అలెగ్జాండర్‌ భావించాడు.

 అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో

అంతం చేశాడు: రష్యాలో ఇప్పుడతను పెద్ద హీరో


ఈ సందర్భంగా తీసిన వీడియోలో తనకు ప్రపంచంలో అత్యుత్తమమైన భార్య దొరికిందని పేర్కొన్నాడు. అలెగ్జాండర్ మృతిలో అతని సొంత గ్రామం విషాదంలో మునిగి పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+