రష్యా-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తత: మానవరహిత విమానాన్ని నేలకూల్చిన జెట్ ఫైటర్స్

రష్యా జెట్ ఫైటర్ ఎస్‌యూ-27.. అమెరికాకు చెందిర రీపర్ డ్రోన్ ను ఢీ కొట్టింది. బ్లాక్ సీ గగనతలంపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 13 నెలలుగా ఈ రెండు దేశాలు నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని మెజారిటీ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది.

ఒత్తిళ్లను ఎదుర్కొంటూ..

ఒత్తిళ్లను ఎదుర్కొంటూ..

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యాకు వ్యతిరేకంగా..

రష్యాకు వ్యతిరేకంగా..

ఉక్రెయిన్ పై రష్యా దండెత్తడాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ వ్యతిరేకిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. రష్యాపై అనేక రకాల ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించాయి ఆయా దేశాలన్నీ. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్య దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. రష్యాను నియంత్రించడంలో తమవంతు సహకారాన్ని అందిస్తోన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు రష్యా దూకుడును నిలువరించడానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుతున్నాయి.

పచ్చగడ్డి వేస్తే..

పచ్చగడ్డి వేస్తే..

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ప్రస్తుతం రష్యా- అమెరికా మధ్య నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య రాత్రికి రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రష్యాకు చెందిన ఎస్‌యూ-27 ఫైటర్ జెట్.. కొద్దిసేపటి కిందటే అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను ఢీ కొట్టింది. బ్లాక్ సీ గగనతలంపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని ఖేర్సన్, ఒడెస్సా నగరాలు బ్లాక్ సీ తీరంలోనే ఉంటాయి. అటు రాకపోకలుసాగించే క్రమంలో రష్యన్ ఫైటర్ జెట్- యూఎస్ రీపర్ డ్రోన్ ను ఢీకొట్టింది.

ఉద్దేశపూరకంగానే..

ఉద్దేశపూరకంగానే..

ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. రష్యా ఉద్దేశపూరకంగానే దీన్ని నేలకూల్చినట్లు భావిస్తోంది. అంతర్జాతీయ గగనతలంలో రోజువారీ పహారా నిర్వహిస్తోన్న సమయంలో తమ రీపర్ డ్రోన్ ను రష్యాకు చెందిన రెండు జెట్‌ ఫైటర్లు అడ్డగించచడానికి ప్రయత్నించాయని అమెరికా పేర్కొంది. దీనిపై తాము అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నామని యూఎస్- యూరోపియన్ కమాండ్, అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ జేమ్స్ హ్యాకర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై రష్యా నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+