రువాండాలో విషాదం: చర్చిపై పిడుగు.. 16మంది మృతి
కిగలి: పిడుగుపాటు కారణంగా ఒక చర్చిలో 16మంది చనిపోయిన సంఘటన రువాండాలోని యారుగురులో చోటు చేసుకుంది. ఘటనలో గాయాలపాలైనవారి సంఖ్య 140వరకు ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.
ప్రత్యేక ప్రార్థనల కోసం కొన్ని వందలమది శనివారం చర్చికి వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే చర్చిపై పిడుగు పడింది. దీంతో చర్చిలో చాలామంది సజీవ దహనమయ్యారు. మిగతావారు హాహాకారాలు చేస్తూ భయంతో బిక్కచచ్చిపోయారు.

పిడుగుపాటుకు గురికాకుండా చర్చిలో ఎలాంటి ఏర్పాట్లు లేవని, కనీసం విద్యుత్ సదుపాయం కూడా అక్కడ లేదని చెబుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications